Jagga Reddy: సీఎం అయ్యేందుకు హరీష్ 5వేల కోట్ల స్కాం.. జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు

2018 ఎన్నికల ముందు హరీష్ రావు రూ.5000 కోట్ల రూపాయలు దాచి పెట్టినట్టు సమాచారం ఉందని జగ్గారెడ్డి అన్నారు. తాను ముఖ్యమంత్రి కావడానికి హరీష్ రావు రూ.5000 కోట్ల లిక్విడ్ క్యాష్ రెడీ చేసి పెట్టాడని ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్‌కు లేఖ రాస్తానని పేర్కొన్నారు.

New Update
Jagga Reddy: సీఎం అయ్యేందుకు హరీష్ 5వేల కోట్ల స్కాం.. జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు

Jagga Reddy: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై (Harish Rao) కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి అధికారంలో ఉన్న ఆనాటి టీఆర్ఎస్ (TRS) ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) హయాంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు భారీగా డబ్బు సంపాదించుకున్నాడని జగ్గారెడ్డి ఆరోపణలు చేశారు.

హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదు...

ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎతులు, అపొజిషన్లో ఉన్నప్పుడు నీతులు చెబుతున్నారని చురకలు అంటించారు. హరీష్ రావు నిజంగా పాపాల భైరవుడే అని పేర్కొన్నారు. హరీష్ రావు పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని వ్యాఖ్యానించారు. రేవంత్, ఉత్తమ్ రివ్యూలు చేస్తుంటే హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదని అన్నారు.

ALSO READ: ఇప్పుడున్న సీఎం దొంగ.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్

సీఎం అయేందుకు 5000 కోట్లు...

2018 ఎన్నికల ముందు హరీష్ రావు రూ.5000 కోట్ల రూపాయలు దాచి పెట్టినట్టు సమాచారం ఉందని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి కావడానికి హరీష్ రావు రూ.5000 కోట్ల లిక్విడ్ క్యాష్ రెడీ చేసి పెట్టాడని అన్నారు. రూ.5000 కోట్లు హరీష్ రావు ఎక్కడ దాచిపెట్టాడో బయటపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి లేఖ రాస్తానని అన్నారు.

అతని దగ్గరే డబ్బులు...

ENC హరిరామ్ దగ్గర హరీష్ రావు డబ్బులు ఉన్నాయని అన్నారు. రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక హరీష్ రావుకు సంవత్సరం దాకా మంత్రి పదవి కేసీఆర్ ఇవ్వలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పులన్నీ బయట పెడతాం.. ఇది ఆరంభం మాత్రమే అని వార్నింగ్ ఇచ్చారు. హరీష్ రావు 5వేల కోట్లు, కవిత, సంతోష్ కొన్ని వేల కోట్లు బ్లాక్ చేశారని ఆరోపించారు.

కేసీఆర్ వల్లే డబ్బు కనిపించడం లేదు..

కేసీఆర్ (KCR) కుటుంబం డబ్బులు బ్లాక్ చేయడం వల్ల మార్కెట్లో డబ్బులు కనిపించడమే లేదని అన్నారు. కాంగ్రెస్ ఉచిత బస్సు పెట్టడంతో మేడారంలో భక్తుల సంఖ్య పెరిగిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజల సొమ్ము కేసీఆర్ అనుభవించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సొమ్ము ప్రజలే అనుభవిస్తున్నారని తెలిపారు.

కిషన్ రెడ్డికి పౌరుషం లేదు..

కేసీఆర్ కుటుంబంపై ఐటీ, ఈడీ దాడులు జరగవు.. కిషన్ రెడ్డిని రండ కేంద్రమంత్రి అంటే సైలెంట్ ఉన్నాడని అన్నారు. కిషన్ రెడ్డికి పౌరుషం లేదు.. సైలెంట్ ఉన్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి పౌరుషం ఉంది కాబట్టి పిసికేస్తుండు అని అన్నారు. సుమన్ లాంటివాళ్ళు ఇంకోసారి ఇలా చేస్తే మేం డైరెక్ట్ వెళ్లి కొడతాం అని స్పష్టం చేశారు. తిట్ల పురాణానికి కేసీఆర్ గురువు అని... కానీ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ కే గురువులు అని పేర్కొన్నారు.

ALSO READ: కేసీఆరే టార్గెట్.. సీఎం రేవంత్ వ్యూహాలు.. కేసీఆర్‌కు షాక్ తప్పదా?

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు