Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ అందుకే ఢిల్లీ వెళ్లారు.. సజ్జల హాట్ కామెంట్స్

పొత్తుల కోసమే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు సజ్జల. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులే వైసీపీ ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఏపీకి రావాల్సిన నిధుల కోసం చర్చించడానికి ప్రధాని మోడీని సీఎం జగన్ కలుస్తున్నారని అన్నారు.

New Update
Sajjala Ramakrishna Reddy: మాకు టార్గెట్ క్లియర్‌గా ఉంది.. చంద్రబాబు సజ్జల స్వీట్ వార్నింగ్!

Sajjala Ramakrishna on CM Jagan Delhi Tour: ఏపీ రాజకీయ ఢిల్లీలో జరుగుతున్నాయి. రాజధాని లేని రాష్ట్రానికి ఢిల్లే రాజధాని అయినట్లు ఉందని.. దీనికి ఉదాహరణ ఏపీ నేతలు ఢిల్లీ బాట పట్టడమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా సీఎం జగన్ (CM Jagan) ఢిల్లీ పర్యటనపై జరుగుతున్న చర్చకు చెక్ పెట్టారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఏపీకి రావాల్సిన నిధుల కోసమే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారని.. ప్రధాని మోడీని (PM Modi) కలిసి చర్చించనున్నారు స్పష్టం చేశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఎలాంటి దాపరికం లేదని అన్నారు.

పొత్తుకోసమే..

టీడీపీ అధినేత చంద్రబాబుపై  (Chandrababu) విమర్శలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. పొత్తుల కోసమే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని అన్నారు. సీఎం జగన్ కు పొత్తులు అవసరం లేదని అన్నారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని అన్నారు. పొత్తు కోసం చంద్రబాబు ఎక్కడికైనా పోతారని చురకలు అంటించారు.
బీజేపీనే టీడీపీ వెంటపడుతున్నట్లు చంద్రబాబు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

Also Read: థియేటర్ లో బీభత్సంగా కొట్టుకున్న పవన్, జగన్ ఫ్యాన్స్..!

చంద్రబాబు అద్దె మైకులా షర్మిల..

వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల. చంద్రబాబు అద్దె మైకులా షర్మిల మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఏపీలో కాంగ్రెస్ కు ఉనికి లేదని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో షర్మిల మాట్లాడుతున్నారని ఆరోపించారు. బాబు రాసిన స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారని పేర్కొన్నారు. షర్మిల చేసిన వ్యాఖ్యలు వాస్తవాలను దూరంగా ఉన్నాయని అన్నారు.

సీఎం జగన్ సింగల్..

పొత్తుల కోసమే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు సజ్జల. తమకు ఏ పార్టీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులే వైసీపీ ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఏపీకి రావాల్సిన నిధుల కోసం చర్చించడానికి ప్రధాని మోడీని సీఎం జగన్ కలుస్తున్నారని అన్నారు.

Advertisment
తాజా కథనాలు