నాగచైతన్య 23వ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి... నాగచైతన్య తన నెక్స్ట్ సినిమా చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య 23వ సినిమాగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పుడు అవి మరింత పెరిగిపోయాయి. దానికి కారణం జాలరి పాత్రలో కనిపించబోతున్న చై పక్కన సాయి పల్లవి నటించబోతోందని తెలుస్తోంది. By Manogna alamuru 19 Sep 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా నాగ చైతన్యతో సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చందూ మొండేటి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే దర్శకుడు చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. చాలా సార్లు వర్క్ షాప్ చేసిన తర్వాతనే సినిమాను పక్క ప్రణాళికతో మొదలుపెట్టారు. ప్రీ పొడక్షన్ లో భాగంగా నాగచైతన్య శ్రీకాకుళం వెళ్ళడం, అక్కడ జాలర్లను అకలవడం వంటివి చేవారు. అంతేకాదు సముద్రం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఓ మెషిన్ బోటులో కూడా ప్రయాణంచేశారు. వీటికి సంబంధించిన వీడియో కొన్నాళ్ళ క్రితం చాలా పాపులర్ అయింది. 2018 లో గుజరాత్ నుంచి సముద్రతీరంలో వేటకు వెళ్ళిన 21 మంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ లకు చిక్కారు. అందులో ఒకరైన రామారావు జీవిత ఆధారంగానే ఈ సినిమాను దర్శకుడు ఇప్పుడు చూపించబోతున్నాడు. ఆతను శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు. అందుకే చై అక్కడకు వెళ్ళి వాళ్ళ జీవన విధానం తెలుసుకుని మరీ వచ్చాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఇందులో హీరోయిన్ ఎవరు అనేది మాత్రం అనౌన్స్ చేయలేదు. కానీ ఈరోజు విడుదల చేసిన ఒక వీడియోలో దృశ్యాలను బట్టి సాయి పల్లవిని చై కి జోడీగా తీసుకున్నారిన తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసిన చిత్ర యూనిట్ సభ్యులు అందులో సాయి పల్లవి మొహం కనిపించకుండా చూపించారు. అందులో ఉన్న అమ్మాయి హావభావాలు చూస్తుంటే అందులో ఉన్నది సాయి పల్లవి అని అర్థమవుతుంది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ సినిమా చేశారు. అది మంచి సక్సెస్ సాధించింది. దాన్ని బట్టి ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఇండస్ట్రీ టాక్. View this post on Instagram A post shared by Geetha Arts (@geethaarts) #telugu #heroin #sai-pallavi #movies #naga-chaitanya #chandu-mondeti #hero #akkineni మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి