Sabarimala : శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వర్చువల్ క్యూ బుకింగ్ తగ్గింపు!

శబరిమల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో ఆలయంలో రద్దీ నెలకొంది. స్వామి దర్శనానికి క్యూలైన్లలో 18 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుంది. దీంతో స్వామివారి దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని తగ్గించారు.

Sabarimala : శబరిమలలో అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీచార్జ్..!!
New Update

Ayyappan Devotees : పవిత్ర పుణ్య క్షేత్రం శబరిమల(Sabarimala) కి భక్తులు(Devotees) పోటేత్తుతున్నారు. స్వామి వారి దర్శించుకునేందుకు స్వాములు, భక్తులు సుమారు 18 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. కేవలం గత శుక్రవారం నుంచి భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. రోజుకు లక్ష మందికి పైగా స్వామి వారి దర్శనానికి వస్తున్నట్లు దేవస్థానం సిబ్బంది తెలిపారు.

దీంతో భక్తులను క్యూలైన్లలో నియంత్రించడం చాలా కష్టం మారినట్లు అధికారులు వివరించారు. గంటల కొద్దీ క్యూలైన్ల వెంట వేచి ఉండలేని భక్తులకు కొందరు బారికేడ్లు (Barricades) దూకి మరి స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. దీంతో పరిస్థితి చేజారి పోతుందని గమనించిన ఆలయాధికారులు ఆన్‌ లైన్‌ క్యూ బుకింగ్‌ ను తగ్గించారు.

దీంతో పది వేల మంది భక్తుల సంఖ్య తగ్గినట్లు సిబ్బంది తెలిపారు. ఆదివారం సాయంత్రానికి భక్తుల వరుస సన్నిధానం నుంచి శబరి పీఠం వరకు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో వస్తున్న స్వాములను చాలా మందిని పంబా (Pamba)వద్దనే నిలిపివేస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. భక్తుల తాకిడిని నివారించేందుకు పోలీసులు అదనంగా మోహరించారు.

ఇదిలా ఉంటే స్వాములు వచ్చిన వాహనాలు ఎరుమేలి, పంబా, నిలక్కల్‌, ఎలవుంకల్‌ ప్రాంతాల్లో బారులు తీరి ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ దేవాదాయ మంత్రి కె.రాధాకృష్ణన్‌ ఆదేశించారు. భక్తుల తాకిడి భారీగా పెరిగినప్పటీకీ దర్శన వేళలు మాత్రం పొడిగించలేమని శబరిమల ప్రధాన అర్చకులు తెలిపారు.

వరుస పెట్టి సెలవులు రావడంతో స్వాములు అధిక సంఖ్యలో దేవస్థానానికి వస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు సాయంత్రం దర్శన వేళల ప్రారంభ సమయాన్ని గంట ముందుకు జరిపినట్లు అధికారులు వివరించారు. దీంతో మధ్యాహ్నం 3 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.

Also read: తిరుమల వెళ్తే భక్తులకు అలర్ట్..ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవల్సిందే..!!

#vartual-booking #online-booking #pamba #kerala #barricades #devotees #sabarimala #tamilnadu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe