అయోధ్యలోని రామమందిరాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇది కోట్లాది మంది కల సాకారమయ్యే శుభఘడియ. అయోధ్యలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రతిష్టాపన శుభ ముహుర్తం వచ్చింది. జనవరి 22, 2024వ తేదీన ప్రతిష్టాపన జరగనుంది. 22వ తేదీ మధ్యాహ్నం 12:45 గంటలకు రామాలయంలోని గర్భగుడిలో రామ్ లల్లాను ప్రతిష్టించాలని ట్రస్ట్ నిర్ణయించింది. ఈ వేడుకకు దేశంలోని అన్నివర్గాలకు చెందిన 4వేల మంది సాధువులను ట్రస్ట్ ఆహ్వానం అందించింది. వచ్చే ఏడాది అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ కూడా హాజరుకానున్నారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన వైదిక ఆచారాలు ప్రధాన వేడుకకు ఒక వారం ముందు నుంచే వచ్చే ఏడాది జనవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయి.
పూర్తిగా చదవండి..Ayodhya Ram Mandir: అయోధ్యలో శ్రీరాముడిని పూజించే రామాలయ ప్రధాన పూజారి ఎవరో తెలుసా?
ఘజియాబాద్‌లోని దుధేశ్వర్ వేద్ విద్యాపీఠ్‌కు చెందిన విద్యార్థి మోహిత్ అయోధ్య రామ మందిరం పూజారిగా ఎంపికయ్యారు. దూధేశ్వర్ వేద్ విద్యాపీఠ్‌లో ఏడేళ్లు చదివిన తర్వాత, మోహిత్ పాండే తదుపరి చదువుల కోసం తిరుపతికి వెళ్లారు. ఇక జనవరి 22న రామాలయం ప్రాణప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే!
Translate this News: