Ukraine: రష్యా ఆక్రమిత ప్రాంతంలో భీకర దాడి.. 28 మంది మృతి ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత లుహాన్స్క్ ప్రాంతంపై భీకర దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ భేకరి ధ్వంసం అయిపోయింది. దాదాపు 28 మంది మృతి చెందారు. ఇది ఉక్రెయన్ బలగాల పనేనంటూ రష్యా అధికారులు ఆరోపిస్తున్నారు. By B Aravind 04 Feb 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా నిత్యం ఎక్కడో ఓ చోట బాంబు దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా యుద్ధ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ బలగాలే ఆ విమానాన్ని కూల్చేశాయని స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. దీంతో ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఉన్న గొడవలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. Also Read: రష్యాలో భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్ గూఢచారి.. 28 మంది మృతి అయితే తాజాగా ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత లుహాన్స్క్ ప్రాంతంపై భీకర దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనలో లిసిచాన్స్క్ నగరంలో ఉన్న ఓ బేకరీ ధ్వంసం అయిపోయింది. దాదాపు 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించినవారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు రష్యా అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వాళ్లలో మరో 10 మందిని కాపాడినట్లు పేర్కొన్నారు. ఇది ఉక్రెయన్ బలగాల పనేనంటూ ఆరోపించారు. యుద్ధం ఎప్పుడు ఆగుతుంది ? ఈ ఘటనపై ఇంకా ఉక్రెయిన్ స్పందించలేదు. మరోవైపు రష్యాకు చెందిన దళాలు సుమీ ప్రాంతంలో 16 చోట్ల దాడులు చేశాయని.. కీవ్ సైన్యాధికారులు ఆదివారం తెలిపారు. గత నెలలో కూడా డొనెట్స్క్‌లో ఓ మార్కెట్‌పై జరిగిన క్షిపణి దాడిలో 27 మంది మృతి చెందారు. 2021లో ఇరు దేశాల మధ్య యుద్దం మొదలైనా పరిస్థితులు ఇంకా సద్దుమణగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేమని ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. Also Read: నమీబియా దేశాధ్యక్షుడు గింగోబ్ కన్నుమూత! #telugu-news #international-news #russia-ukraine-war #russia-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి