Namibia President: నమీబియా దేశాధ్యక్షుడు గింగోబ్ కన్నుమూత! నమీబియా దేశా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు ఆ దేశ అధికారిక సంస్థలు వెల్లడించాయి. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటూ ఆదివారం మరణించారు. By Bhavana 04 Feb 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Namibia President: నమీబియా(Namibia) దేశా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ (Hez Gingobe) ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు ఆ దేశ అధికారిక సంస్థలు వెల్లడించాయి. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్ (Cancer) తో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటూ ఆయన ఆదివారం ఉదయం కన్నుమూసినట్లు తెలిపారు. ఆయన గత నెలాఖరులో వైద్య పరీక్షల కోసం యూఎస్ కు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రోజున నమీబియా అధ్యక్షుడు మరణించడం విషాదాకరం. గెంగోబ్ విండ్ హోక్ లోని లేడీ పోహంబా ఆసుప్రతిలో గింగోబ్ మరణించారు. 2014లోనే ఆయన ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఓ సారి ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి బయటపడినట్లు గింగోబ్ తన దేశ ప్రజలకు చెప్పారు. గింగోబ్ ఆకస్మిక మరణం పట్ల రాజకీయ నాయకులతో పాటు సామాన్యులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే గింగోబ్ మరణించారు. Also read: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే..! #gingob #namibia #president #cancer #die మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి