Russia Attacks on Ukraine: ఎవరు చెప్పినా..ఏం చేసినా తన పంతం నెగ్గించుకుంటాననే అంటోంది రష్యా. మధ్యలో గ్యాప్ ఇస్తూనే మళ్ళీ మళ్ళీ దాడులకు పాల్పడుతోంది. తాజాగా నిన్న ఉక్రెయిన్ మీద విరుచుకుపడింది రష్యా. ఒక్కరోజులోనే 100 క్షిపణులు, 100 డ్రోన్లతో భీకర దాడి చేసింది. ఉక్రెయిన్‌తోపాటు పొరుగున ఉన్న అనేక పశ్చిమ ప్రాంతాల్లో ఈ పేలుళ్లు జరిగాయి. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు. దీనివలన తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లోని వోలిన్, ఎల్వివ్, ఇవానో-ఫ్రాన్కివ్స్క్, విన్నిట్సియా, ఖ్మెల్నిట్స్కీ, టెర్నోపిల్ ప్రాంతాలను లక్ష్యాలుగా చేసుకొని రష్యా బాంబులు విసిరింది. ఈ దాడిలో ప్రాణ నష్టం కూడా చాలానే జరిగింది. ప్రస్తుతానికి వీటిని ఉక్రెయిన్ సమర్ధవంతంగానే ఎదుర్కొంటోంది.
అయితే ఇలాగే రష్యా దాడులు చేస్తుంటే తమకు కష్టం అవుతుందని..వాటిని అడ్డుకునేందుకు యూరోపియన్ దేశాలు సహాయం చేయాలని ఆయన కోరారు. రష్యా క్షిపణులు, డ్రోన్‌లను కూల్చేందుకు తమ వైమానిక దళంతో పొరుగున ఉన్న యూరోపియన్ దేశాల రక్షణ వ్యవస్థలు కలిసి పనిచేయాలని జెలెన్ స్కీ కోరారు. దీని ద్వారా తమ దేశ పౌరుల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎక్కువ ప్రయత్నించగలమన్నారు.
Also Read: Hyderabad: కోకాపేటలో బిడ్డర్లకు ఎక్కువ భూమి..హెచ్‌ఎండీఏ సర్వే