ఇజ్రాయెల్ పై భారీ దాడులు.. వరుస రాకెట్లు ప్రయోగించిన హెజ్బుల్లా
ఇజ్రాయెల్ పై హెజ్బుల్లా విరుచుకుపడింది. మంగళవారం వరుస రాకెట్లను ప్రయోగించింది. లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ పౌరులను ఖాళీ చేయించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 170 రాకెట్లను హెజ్బుల్లా ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.