World Cup 2023: ఏకంగా 9మంది బౌలింగ్ చేశారు..రోహిత్, కోహ్లీకి వికెట్లు

నిన్నటి నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ అదరగొట్టేసింది. సెంచరీలు, హాఫ్ సెంచరీలతో బ్యాటర్లు అదరగొట్టారు. దానికి తోడు 11ఏళ్ళ తర్వాత రోహిత్, 9 ఏళ్ళ తర్వాత కోహ్లీ వికెట్లు తీసి ఫ్యాన్స్ కు కన్నుల పండుగ చేశారు.

World Cup 2023: ఏకంగా 9మంది బౌలింగ్ చేశారు..రోహిత్, కోహ్లీకి వికెట్లు
New Update

World Cup 2023: వరల్డ్ కప్ లో భారత్ కు తిరుగులేకుండా పోయింది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దూసుకుపోతోంది టీమ్ ఇండియా (Team India). ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగి పసికూనను మట్టికరిపించారు. కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్‌లు సెంచరీలు చేస్తే రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్నటి మ్యాచ్‌లో (Ind vs Ned) మరో ఇంట్రస్టింగ్ విషయం జరిగింది. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి 400 స్కోరు కొట్టింది. దాంతో అక్కడే సగం విజయం ఖరారు అయిపోయింది. దీంతో భారత్ ప్రయోగాలు చేసింది. మొట్టమొదటిసారి ప్రపంచకప్‌లో తొమ్మది మంది భారత బౌలర్లు బౌలింగ్ కు దిగారు. రెగ్యులర్ బౌలర్లతో పాటూ విరాట్ (Virat Kohli), రోహిత్ (Rohit Sharma), గిల్, సూర్య కుమార్‌లు కూడా బౌలింగ్ చేశారు. అంతేకాదు 11 ఏళ్ళ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, 9 ఏళ్ళ తర్వాత కింగ్ కోహ్లీలో చెరో వికెట్ తీసుకున్నారు. ఇది నిజంగా ఫ్యాన్స్ కు పండుగే. ఇద్దరు టాప్ క్లాస్ బ్యాటర్లు భారత ప్రజలకు దీపావళి కానుక ఇచ్చారు.

Also Read:బాధలు పడుతున్నా…బుద్ధిరాలేదు.. ఢిల్లీలో పేలిన టపాసులు

విరాట్‌.. స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ వికెట్‌ తీయగా, రోహిత్‌.. నెదర్లాండ్స్‌ టాప్‌ స్కోరర్‌ తేజ నిడమనూరు వికెట్‌ పడగొట్టాడు. రోహిత్‌ చివరిసారిగా 2012 ఫిబ్రవరిలో వన్డే వికెట్‌ తీశాడు. నాటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ ఆసీస్‌ ఆటగాడు మాథ్యూ వేడ్‌ వికెట్‌ దక్కించుకున్నాడు. రోహిత్‌ తన కెరీర్‌లో తొమ్మిది వన్డే వికెట్లు, రెండు టెస్ట్‌ వికెట్లు, ఓ టీ20 వికెట్‌ పడగొట్టాడు.

నిన్నటి మ్యాచ్‌లో మరో ఫన్నీ ఇన్సిడెంట్ కూడా జరిగింది. మొత్తం మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మొదట ఓవర్లో విరాట్ 7 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్ అయిన తర్వాత కోహ్లీ స్టాండ్స్‌లో ఉన్న తన భార్య అనుష్కను చూస్తూ బౌలింగ్ చేశా కదా కనీసం చప్పట్లు కూడా కొట్టవా అంటూ సైగలు చేశాడు. దానికి అనుష్క నవ్వడం హైలట్ గా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#virat-kohli #cricket #india #rohith-sarma #world-cup #icc-world-cup-2023 #bowling
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe