Cricket: వాళ్ళు పిచ్‌ను మార్చారు-మహ్మద్ కైఫ్

ఇండియా వరల్డ్‌కప్‌ ఫైన్లస్‌లో ఓడిపోవడానికి కారణం వాళ్ళిద్దరఏ అంటున్నాడు భారత మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్. రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ పిచ్‌ను మార్చారని...అక్కడే తప్పు జరగిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వాళ్ళు పిచ్‌ను మార్చడం తాను స్వయంగా చూశానని చెబుతున్నాడు.

New Update
Cricket: వాళ్ళు పిచ్‌ను మార్చారు-మహ్మద్ కైఫ్

World Cup Finals: చాలా ఏళ్ళ తరువాత భారత్ వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. అందరూ ఇండియా గెలుస్తుందని అనుకున్నారు. కానీ అనైఊహ్యంగా ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. కేవలం 240 పరుగులకు ఆలౌట్ అయిపోయి ఆస్ట్రేలియా చేతికి కప్ అందేలా చేశారు భారత ఆటగాళ్ళు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో ఫెయిల్ అయ్యారు. ఆరవసారి ఆస్ట్రేలియా జగజ్జేతగా నిలబడేలా చేశారు. ఇది ముగిసిన తర్వాత ఇండియా ఫైనల్స్ ఓడిపోవడానికి కారణాలు వెతికారు. అందరూ కలిసి ఫైనల్స్ జరిగిన అహ్మదాబాద్ స్టేడియం పిచ్చ్ కారణమని తేల్చారు. సెకండ్ సెషన్‌లో పిచ్ స్లో అయిపోయింది. అందుకే ఓడిపోయామని చెప్పారు.

వాళ్ళు కావాలనే చేయించారు..

అయితే ఇప్పుడు అదంతా బక్వాస్ అంటున్నాడు ఇండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ కావాలనే పిచ్ ప్లో అయ్యేట్టు తయారు చేయించారు కదా...ఇప్పుడు ఎందుకు సాకులు చెబుతున్నారు అని అడుగుతున్నాడు. మ్యాచ్‌కు మూడు రోజుల ముందు నుంచా రోహిత్, రాహుల్‌లు రోజూ పిచ్ దగ్గరకు వచ్చి ఒక గంట ఉండి వెళ్ళేవారు. ఆ మూడు రోజుల్లో పిచ్ రంగు మారడం తాను స్వయంగా చూశానని అంటున్నాడు కైఫ్. నీళ్ళు పోయనివ్వలేదు, గడ్డి లేకుండా చేశారు. దీంతో అది స్లో పిచ్‌గా మారింది. ఇలా కావాలనే చేశారు. ఆస్ట్రేలియా వాళ్ళకు స్లో పిచ్ ఇవ్వాలని ప్లాన్ చేశారు. మేమేమీ కలపించుకోలేదు. క్యూరేటర్ తన పని తాను చేశాడని చెబుతున్నారు. అందతా అబద్ధం అంటున్నాడు కైఫ్. రోహిత్, రాహుల్..అతనితో మాట్లాడి పిచ్ తమకు అనుకూలంగా మార్పించుకున్నారు. కానీ తీరా మ్యాచ్ టైమ్ వచ్చేసరికి మాత్రం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు.

ఫ్లాట్ అయి ఉంటే..

పిచ్‌ను వాళ్ళు ఏమీ చేయకుండా ఉండి ఉంటే ఇండియా తప్పకుండా గెలిచేదని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. షమీ, బుమ్రా, జడేజా, కులదీపక యాదవ్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఫ్లాట్ పిచ్ ఉండి ఉంటే వందశాతం ఫైనల్ మ్యాచ్ మనదే అయ్యేదని చెబుతున్నాడు. వికెట్‌ను మార్చారు...అక్కడే బొక్క బోర్లా పడ్డారు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు కైఫ్.

Also Read:Telangana: ప్రణీత్‌రావు కస్టడీకి అనుమతినిచ్చిన కోర్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు