Telangana: ప్రణీత్‌రావు కస్టడీకి అనుమతినిచ్చిన కోర్టు SIB మాజీ DSP ప్రణీత్ రావు ను పోలీస్ కస్టడీ కి నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రణీత్ రావును ఏడు రోజుల పాటు కస్టడీ లోకి తీసుకోవచ్చని తెలిపింది.రేపు చంచల్ గూడ జైలు నుండి అతనిని కస్టడీలోకి తీసుకొంటామని పంజాగుట్ట పోలీసులు చెబుతున్నారు. By Manogna alamuru 17 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Praneeth Rao Custody: మొత్తానికి ప్రణీత్ రావు కస్టడీని పంజాగుట్ట పోలీసులు దక్కించుకున్నారు. అతనిని విచారించేందుకు నాంపల్లి కోర్టు ఏడురోజుల పాటూ అనుమతినిచ్చింది. చంచల్ గూడ జైల్లో ఉన్న ప్రణీత్‌రావును పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. అంతకు ముందు మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్ట్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నిఘా కెమెరాలు పనిచేయకుండా చేసి హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన కేసులో ప్రణీత్‌రావు నిందితుడు. ఇటివలే ఆయన్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఇక ప్రణీత్‌రావును తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డిఎస్పీగా పనిచేశారు ప్రణీత్. ఆయనతో పాటు ఈ కేసులో సంబంధమున్న ఇతరులపై చర్యలు చేపట్టాలని అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రణీత్‌రావుపై పంజాగుట్ట పోలీసులు అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) 409, 427, 201తో పాటు ఐటీ ఆక్ట్ సెక్షన్ 65, 66, 70 ప్రకారం కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది: గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేశారనే ఆరోపణలు ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు పై ఉన్నాయి. దీనిపై కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన్ను విధుల్లో నుంచి తప్పించింది రేవంత్ సర్కార్. అయితే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురైన ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు అంశంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబీలోని ఎస్ఓటి టీంలో కీలకంగా ఆయన వ్యవహరించారు. ఎస్ఐబీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. 42 హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను ప్రణీత్ రావు తగులబెట్టినట్లు నిర్ధారించారు. కీలకమైన ఎస్ఓటి లాకర్ రూంలోని ఫైల్స్ మొత్తం ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీసు శాఖ గుర్తించింది. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు.. కాల్ రికార్డులు కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని కూడా నాశనం చేసినట్లు గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. హెచ్ డీడీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. Also Read:Titanic: ప్రేమనౌక మళ్ళీ వచ్చేస్తోంది..2027నాటికి టైటానిక్ #phone-tapping #arrest #praneeth-rao #custody మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి