Israel-Hamas war:గాజాలో కాల్పుల విరమణకు ఐరాసలో తీర్మానం..అమెరికా తిరస్కరణ యుద్ధం మొదలై రెండు నెలలు గడుస్తోంది. ఇరు వర్గాలు ఎక్కడా తగ్గడం లేదు. మధ్యలో ఓ వారం రోజులు ఇజ్రాయెల్ కాల్పులు విరమించినా...మళ్ళీ గాజాను అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ కోసం ఐరాస కోసం చేసిన ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. By Manogna alamuru 09 Dec 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి గాజాలో ఇజ్రాయెల్ తన కాల్పులను తీవ్రతరం చేస్తోంది. హమాస్ ను అంతం చేసేవరకు కాల్పులను ఆపేదే లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. కాల్పుల్లో గత 24 గంటల్లో గాజాలో 300 మంది మరణించారు. మరోవైపు గాజాలో కాల్పులను విరమించాలని ఐక్యరాజ్య సమితి కోరుతోంది. దీని కోసం నిన్న ఐరాసలో కాల్పుల విరమణ ప్రతిపాదించింది. కానీ దీన్ని అమెరికా తోసిపుచ్చింది. 13 సభ్య దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. కానీ అమెరికా దానిని వీటో అధికారం ఉపయోగించి తిరస్కరించింది. Also Read:తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు హమాస్ ను పూర్తిగా నిర్మూలించాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. దీనికి అమెరికా పూర్తిగా మద్దతిస్తోంది. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తక్షణ కాల్పుల విరమణ కోసం అత్యవసర భద్రతా మండలి సమావేశాన్ని పిలవడానికి యూఎన్ చార్టర్ లోని ఆర్టికల్ 99ని ఉపయోగించారు ఆర్టికల్ 99 చాలా అరుదుగా ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. రెండు నెలలుగా జరుగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో గాజాలో 17,487 మంది మరణించారు. మొదట హమాస్ ఇజ్రాయెల్ లో దాడి చేసి 1200 మందిని చంపారు. 240మందికి పైగా బందీలుగా చేసుకున్నారు. ఇందులో 50 మందిని వదిలిపెట్టారు. మిగతావారు ఇంకా హమాస్ చేతిలోనే ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దాడులను మొదలుపెట్టింది. దీంతో గాజాలో దాదాపు 80 శాతం మంది నిరాశ్రయులయ్యారు. #usa #united-nations #israel #hamas #war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి