Srinivasa Reddy: అర్థరాత్రి జీవో ఇచ్చినంత సింపుల్‌గా పార్టీనుండి తీసేశారు

బీజేపీ బహిష్క్రత నేత యెన్నం శ్రీనివాస రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌ రెడ్డి వల్ల తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు 22 శాతం నుంచి 12 శాతానికి పడిపోయిందన్నారు. అధ్యక్ష బాధ్యతలు కిషన్‌ రెడ్డికి కాకుండా ఈటల రాజేందర్‌కు అప్పగించి ఉంటే బాగుండేదన్నారు.

New Update
Srinivasa Reddy: అర్థరాత్రి జీవో ఇచ్చినంత సింపుల్‌గా పార్టీనుండి తీసేశారు

Srinivasa Reddy: ప్రభుత్వం అర్థరాత్రి జీవో ఇచ్చిన విధంగా బీజేపీ పార్టీ నుంచి తనను అకారణంగా సస్పెండ్‌ చేసిందని బీజేపీ బహిష్క్రత నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. బీజేపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన..తనకు స్పెషల్‌ లాఠీలు పోలీసులు కొత్తేంకాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఇలాంటి వాటిని అనేక సార్లు ఎదుర్కొన్నట్లు గుర్తు చేశారు. ప్రశ్నించే పార్టీకోసం పని చేసేవారికే అధిష్టానం నుంచి షోకాజ్‌ నోటీసులు వస్తుంటాయన్నారు. తాను పార్టీకోసం కష్టపడి పని చేశానని, పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకపోతే ప్రశ్నించినట్లు వెల్లడించారు.

Also Read: కాంగ్రెస్‌లోకి తుమ్మల చేరికకు బ్రేక్.. పార్టీ మారుతారా?

2014వ సంవత్సరం రాజ్యసభలో బీజేపీ పార్టీ తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని చూసిందని శ్రీనివాస్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీలు గతంలో తెలంగాణ బిల్లును బొందపెట్టాలని చూశారని ఆరోపించారు. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. 2014లో బీజేపీ పార్టీ తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని కుట్ర పన్నితే కిషన్‌ రెడ్డి మాత్రం రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాల్సింది పోయి.. హైదరాబాద్‌కు వచ్చి పడుకున్నాడని విమర్శించారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలు ఎవరూ తెలంగాణ బిల్లు కోసం పోరాటం చేయలేదని, తెలంగాణ బిల్లు విషయంలో వెంకయ్య నాయుడిని ప్రశ్నించిన ఘనత తమదన్నారు.

బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్‌ మెరుగ్గా పనిచేశాడని శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బండి సంజయ్‌ సారధ్యంలో రాష్ట్రంలో 22 శాతానికి బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. బండి సంజయ్‌ అధ్యక్ష బాధ్యతకు సంబంధించిన పదవికాలం పూర్తియిన అనంతరం పార్టీ అధిష్టానంతో మాట్లాడానన్న ఆయన.. అధ్యక్ష పదవి అందరికీ తెలిసిన నేతకు అప్పగించాలని కోరినట్లు తెలిపారు. ఈటల రాజేందర్‌కు అధ్యక్ష పదవి ఇచ్చివుంటే బాగుండేదన్న ఆయన.. తమ అభిప్రాయాన్ని ఢిల్లీ వెళ్లి పెద్దలకు చెప్పామన్నారు. అధికార పార్టీ నుంచి బయటకు వచ్చి, బై పోల్‌లో విజయం సాధించిన వ్యక్తికి ఇవ్వకుండా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డికి ఇవ్వడం ఎంటని ప్రశ్నించారు. మరోవైపు బండి సంజయ్‌ సారధ్యంలో బీజేపీ ఓటు బ్యాంకు 22 శాతంగా ఉండగా.. కిషన్‌ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక 12 శాతానికి పడిపోయిందని యెన్నం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

Also Read: తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్‌దే గెలుపు.. పీకే కీలక వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు