Israel-Hamas: గాజాలో ఆగని యుద్ధం.. కనీస సౌకర్యాలు లేక ప్రజల అవస్థలు

గాజాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడి శిబిరాల్లో ఉంటున్న ప్రజలకు కనీసం మంచి నీళ్లు కూడా అందుబాటులో లేవు. చాలామందికి చర్మవ్యాధులు సోకాయి. కనీసం మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.

New Update
Israel-Hamas: గాజాలో ఆగని యుద్ధం.. కనీస సౌకర్యాలు లేక ప్రజల అవస్థలు

గత 10 నెలలుగా జరుగుతున్న ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో ఎంతోమంది అమయాక ప్రజలు మృతి చెందారు. ఎన్నో కుటుంబాల జీవన పరిస్థితి ఛిద్రమైంది. ప్రస్తుతం గాజాలో ఎక్కడ చూసిన బాంబుల మోతలే వినిపిస్తున్నాయి. అక్కడి ప్రజలు శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. కానీ వారికి కనీస అవసరాలు కూడా తీరే పరిస్థితులు కనిపించడం లేదు. తాగడానికి కనీసం మంచి నీళ్లు లేవు. దువ్వెనలు, షాంపూలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఆడవారికి అవసరమైన నెలసరి వస్తువులు కూడా అందుబాటులో లేవు. అలాగే శిబిరాలు కూడా రద్దీగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార కేసు.. అసలేం జరిగిందంటే?

స్నానం చేయడానికి కూడా నీళ్లు దొరకడం లేదు. చాలామందికి చర్మవ్యాధులు సోకాయి. మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉంది. గాయాలకు రాసే చిన్న ఆయింట్‌మెంట్ ధర ఏకంగా 53 డాలర్లు ఉంది. రఫా సరిహద్దును ఇజ్రాయెల్‌ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అంతర్జాతీయ మానవతా సాయం కూడా తగ్గిపోయింది. ఆ సరిహద్దును దాటుతేనే కావాల్సిన ఔషధాలు లోపలికి వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం గాజాలో నివాసయోగ్యమైన పరిస్థితులు లేకపోవడం వల్ల మరిన్న వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

పాలస్తీనా ప్రాంతాన్ని పోలియో మహమ్మరి ప్రాంతంగా ఇటీవలే గాజా ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ సైనిక చర్య వల్ల ఇక్కడ ఆరోగ్య మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఆరోపణలు చేసింది. దీనివల్లే వైరస్ వ్యాపించిందని.. ప్రపంచ పోలియో నిర్మూలన కార్యక్రమానికి ఇది ఎదురుదెబ్బ అని పేర్కొంది.

Also Read: తరుముకొస్తున్న మంకీపాక్స్.. ఆఫ్రికాలో హెల్త్ ఎమర్జెన్సీ!

Advertisment
తాజా కథనాలు