COVID Vaccine: వార్నీ.. 217 సార్లు కరోనా టీకా వేయించుకున్నాడు.. చివరికి

జర్మనీలో ఓ వ్యక్తి ఏకంగా 217 సార్లు కరోనా టీకా తీసుకున్నట్లు చెప్పాడు. దీంతో ఓ శాస్త్రవేత్తల బృందం అతడిపై పరిశోధనలు జరిపింది. సాధారణ సంఖ్యలో వ్యాక్సిన్లు తీసుకున్న లాగే అతడి రోగనిరోధక వ్యవస్థలో టీ కణాలు సమర్థమంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.

New Update
COVID Vaccine: వార్నీ.. 217 సార్లు కరోనా టీకా వేయించుకున్నాడు.. చివరికి

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. కోట్లాదిమంది ఈ మహమ్మారి సోకగా.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ నుంచి తప్పించుకోవడం కోసం.. శాస్త్రవేత్తలు పలు వ్యాక్సిన్లలను అభివృద్ధి చేశారు. ఇవి వైరస్‌ బారిన పడుకుండా ఉండేందుకు.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడ్డాయి. ఇప్పటికే చాలామంది టీకా రకాన్ని బట్టి వివిధ డోసులు వేసుకున్నారు. మరికొందరైతే ఎక్కువసార్లు వ్యాక్సిన్ వేయించుకున్న దాఖలు కూడా ఉన్నాయి. అయితే జర్మనీకి చెందిన ఓ వ్యక్తి.. ఏకంగా 200 సార్లకు పైగా కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవడం చర్చనీయాంశమవుతోంది. దీంతో అతనిపై పరిశోధలను చేసిన శాస్త్రవేత్తలు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Also Read: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితుడ్ని పట్టిస్తే రూ.10 లక్షల రివార్డు..

పరీక్షలు జరిపిన శాస్త్రవేత్తలు 

ఇక వివరాల్లోకి వెళ్తే.. జర్మనీలో 6 కోట్లకు పైగా ప్రజలు వ్యాక్సిన్లు తీసుకున్నారు. వీళ్లలో చాలామంది రెండు డోసుల కంటే ఎక్కువ వేయించుకున్నవాళ్లే. తాజాగా ఓ వ్యక్తి 217 సార్లు కరోనా టీకా వేయించుకున్నట్లు తెలిపాడు. అధికారిక వివరాల ప్రకారం అతడు 134 సార్లు టీకా తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం బయటపడటంతో.. ఎర్లాంగెన్‌-నర్న్‌బర్గ్‌లోని ఫ్రెడ్రిక్‌ అలగ్జాండర్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం అతని దగ్గరికి వెళ్లింది. ఒక వ్యక్తి ఇలా ఎక్కువగా వ్యాక్సిన్లు తీసుకుంటే ఇమ్యూనిటిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అని తెలుసుకునేందుకు అతడిపై పరీక్షలు జరిపింది. ఇందుకు సంబంధించిన అధ్యయనాన్ని లాన్సెంట్ జర్నల్‌లో ప్రచూరించింది.

గత అధ్యయనానికి భిన్నంగా 

' మామూలుగా HIV,హెపటైటిస్ బి వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు నిరంతరం టీకా వేసుకుంటే అది సాధారణ మంటలను కలిగిస్తుంది. ఒక వ్యక్తి ఎక్కువసార్లు టీకా వేసుకుంటే.. అతని రోగ నిరోధక వ్యవస్థలోని 'టీ కణాలు' అలసిపోతాయని.. అలాగే అవి ప్రొ-ఇన్‌ఫ్లమేటరీని తక్కువ మోతాదులో విడుదల చేస్తాయి. దీని ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి వ్యాధికారకాలను సమర్థవంతంగా ఎదుర్కోలేవని గతంలో చేసిన అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే తాజాగా నిర్వహించిన అధ్యయనంలో అలాంటి సూచనలు కనిపించలేవు అని పరిశోధకులు వెల్లడించారు ' అని ఆ జర్నల్‌లో ప్రచురించారు.

అలాంటి సంకేతాలు కనిపించలేదు

అలాగే ఆ వ్యక్తి శరీరంలో కొవిడ్‌పై పోరాడే టీ కణాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లో మా అధ్యయనంలో తేలినట్లు ఆ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి అలసిపోయినట్లు కనిపించలేవని.. సాధారణంగా రెండు, మూడుసార్లు వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ల లాగే ఈ వ్యక్తిలో కూడా టీ కణాలు సమర్థమంతంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. అసలు అతడి రోగ నిరోధక శక్తి బలహీనపడిందనే సంకేతాలు మాకు కనిపించలేదని వెల్లడించారు.

Also Read: తమిళనాడు నుంచి శ్రీలంకకు తరలిస్తున్న రూ.108 కోట్ల మాదకద్రవ్యాల పట్టివేత!

Advertisment
తాజా కథనాలు