/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Ravana-More-than-Just-a-Rakshasa.jpg)
Ravana:ప్రతీకథలోనూ ఒక హీరో ఉంటే ఒక విలన్ ఉంటాడు. అది ఇప్పుడు అయినా అప్పుడు అయినా. దేవుళ్ళ కథలైనా..రాజుల చరిత్రలైనా...నేటి హీరోల సినిమాలు అయినా ఇదే పంథా. చెడుపై మంచి సాధించే విజయానికే ఎప్పుడూ విలువ ఉంటుంది. వాల్మీకి రామాయణం కూడా ఇదే చెబుతోంది. రావణుడిపై రాముడు సాధించిన విజయమే ఈ గాథ. మనుషులకు రాముడు ఆదర్శమయితే...ఇందులో విలన్, రాక్షసుడు కూడా ఆదర్శమే. ఒక అత్యంత ప్రతిభాశాలి క్రూరుడు, రాక్షసుడు అయి ఎలా నాశనం అయిపోయాడో చెప్పే కథే రామాయణం.
Also Read:అయోధ్య రామునికి ఏడువారాల నగలు..వాటి విలువ ఎంతో తెలుసా..
రామాయణం...నార్త్, సౌత్...
భారతదేశంలో నాలుగు దిక్కులున్నా ముఖ్యంగా రెండింటినే చెప్పుకుంటారు. అవే ఉత్తర భారతం, దక్షిణ భారతం. ఇవి రెండూ వేరు వేరు కల్చర్లతో కూడి ఉంటాయి. మొత్తంగా భారతీయులు అందరూ ఒకే హిందూత్వాన్ని, ధర్మాన్ని పాటిస్తున్నా...లోపలికి వెళితే తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. రామాయణం విషయంలో కూడా ఈ తేడా ఎప్పటి నుంచో ఉంది. భారతీయులందరికీ రాముడు ఆరాధ్య దేవుడే. కానీ దక్షిణ భారతీయులకు రావణుడు కూడా ఆరాధ్యుడే. ముఖ్యంగా తమిళులు తాము రావణుని వారసులమని చెప్పుకుంటారు. కొన్న ఇచోట్ల ఆయనకు ఆలయాలు కూడా కట్టి పూజిస్తున్నారు. సకల కళా పారంగతుడు అయిన రావణుని వారసులం అని దక్షిణాదులు గర్వంగా చెప్పుకుంటారు.
ట్రెండ్ అవుతున్న రావణుడు..
గత కొన్ని రోజులుగా భారతదేశం రామనామం జపిస్తోంది. ముఖ్యంగా నిన్నంతా కూడా రామమయం అయిపోయింది. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. సోషల్ మీడియాలో రాముని పేరు సూపర్ ట్రెండ్ అయింది. అయితే అదే సమయంలో రావణుడి పేరు కూడా విపరీతంగా ట్రెండ్ అయింది. దీనికి కారణం తమిళులు. నార్త్ అంతా తమ దేవుడు అయిన రాముని పేరును ట్రెండ్ చేస్తే దక్షిణ భారత ప్రజలు రావణుడి పేరు ట్రెండ్ చేశారు. ముఖ్యంగా తమిళులు. రావణుడి గొప్పతనాన్ని, తాము ఎలా ఆయన వారసులమో చెబుతూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టారు.
Today.. On this day...
In #LandOfRavanan we celebrate #RAVANANpic.twitter.com/o5Fwovk0Wf— thirumurugan gandhi (@thiruja2009) January 22, 2024
தமிழ் நாடு என்றைக்கும் இராவணனின் நிலம் தான் இங்கு ராமனுக்கு இடம் இல்லை#LandOfRavananpic.twitter.com/ZLCHlOJe6s
— JohnSebastinraj. A (@asebastinraj2) January 22, 2024
இது எங்கள் மண் தமிழர் நிலம்..
இங்கு இராமனுக்கோ அனுமனுக்கோ
காவிக்கூட்டத்திற்கோ
இடமில்லை..#LandOfRavananpic.twitter.com/4gzKcm785a— தோழர் தமிழ் (@Eezhatiger) January 21, 2024
ఎక్స్‌లో రావణుడికి సంబంధించి బోలెడు పోస్ట్‌లు వచ్చాయి. ఇందులో రావణుడు గొప్ప హీరో అని అబివర్ణించారు. అతను కళలలో ఉత్తముడు, పది తలలు ఉన్నాయంటూ పొగిడారు. తమిళులుగా తాము రావణుని వారసులమని చెప్పడానికి ఎంత మాత్రమూ సిగ్గుపడమని, అది తమకు గర్వకారణమని రాశారు. అలాగే తమిళనాడు రావణభూమిగా చెప్పుకున్నారు.
இது எங்கள் மண் தமிழர் நிலம்..
இங்கு இராமனுக்கோ அனுமனுக்கோ
காவிக்கூட்டத்திற்கோ
இடமில்லை..#LandOfRavananpic.twitter.com/4gzKcm785a— தோழர் தமிழ் (@Eezhatiger) January 21, 2024
For starters, we don't believe in mythical characters.
Aryans used Ravan as a tool to vilify us, sons of Shiva.
Hence, we made it our character of pride.
Any shiv devotee portrayed as villain in Aryan mythology is our guy.#TamilsPrideRavanaapic.twitter.com/x6KC871iCs— Sheriff Ali Ibn El Kharish (@mindgage) January 22, 2024
ఒకరిని హీరో చేయాలంటే మరొకరిని విలన్చేయక తప్పదు కాబట్టే రాముడిని మహానుభావుడిగా చేసేందుకు రావణుడిని రాక్షసుడిగా చేశారని అంటున్నారు తమిళయన్లు. శివ కుమారులు, భక్తులను కించపరిచేందుకే రావణుడిని సాధనంగా ఆర్యులు సాధనంగా చేసుకున్నారని అంటున్నారు. ప్రపంచంలో ఏ శివభక్తుడు అయినా మనవాడే అంటున్నారు తమిళయన్లు.
எம் தமிழர் மூதாதை, எம் தமிழர் பெருமான் இராவணன் காண்!
அவன் நாமம் உலகமறியும்!
❤️💛#JaiRavanaFromTamilnadu#TamilsPrideRavanaapic.twitter.com/yMASp4iD8L— Mohankumar Saraswathi (@MohankumarSaras) January 22, 2024