/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/1-9-jpg.webp)
Pushpa 2 : నేషనల్ క్రష్(National Crush) రష్మిక మందాన్న(Rashmika Mandanna) తన అప్ కమింగ్ మూవీ 'పుష్ప 2' పై భారీ అంచనాలు పెంచేస్తోంది. సుకుమార్, అల్లు అర్జున్(Allu Arjun) కాంబోలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పార్ట్ వన్ 'పుష్ప' భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీకి సంబంధించి రష్మిక ఆసక్తికర విషయాలు పంచుకుంది.
Lifestyle Asia. ❤️ it was so much fun shooting with you guys❤️❤️ @WestAustralia thank you so much for hosting us ❤️ pic.twitter.com/JoGdXJXMh6
— Rashmika Mandanna (@iamRashmika) April 12, 2024
నాకు అవగాహన లేదు..
ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి సెకండ్ పార్ట్ లో తన పాత్ర ప్రత్యేకత గురించి ఓపెన్ అయింది. ‘పుష్ప: ది రైజ్’లో అవకాశం ఇవ్వడం సంతోషాన్నిచ్చింది. అయితే ఈ కథ గురించి ఫస్ట్ నాకు అవగాహన లేదు. శ్రీవల్లి పాత్ర ఎలా ఉంటుందో తెలియదు. ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తున్నారో ఊహించలేకపోయా. సెట్లో అడుగు పెట్టిన ప్రతిసారీ ఖాళీ మైదానంలో తిరుగుతున్నట్లు అనిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు. నా క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలుసు. మొదటి పార్ట్ కంటే మరింత బలంగా ఉండబోతుంది. సీక్వెల్‌లో శ్రీవల్లి 2.0(Srivalli 2.0) ను చూస్తారు' అంటూ మూవీపై క్యూరియాసిటీ పెంచేసింది.
ఇది కూడా చదవండి: Fire Accident : బాయ్స్ హాస్టల్ లో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది!
అలాగే తన కెరీర్ లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ‘డియర్ కామ్రేడ్’ తన హృదయానికి దగ్గరైందని చెప్పింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా... తన నటనకు ప్రశంసలు దక్కినట్లు గుర్తు చేసుకుంది రష్మిక.