Kenya: కెన్యాలో భారీ వర్షాలు..38 మంది మృతి అకాల వర్షాలు, భారీ వరదలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. దుబాయ్ ,చైనాలను వణికించిన భారీ వర్షాలు ఇప్పుడు కెన్యాను అతలాకుతలం చేశాయి. దీని ధాటికి ఇప్పటికి వరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. By Manogna alamuru 25 Apr 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Heavy Rains In Kenya :తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యా ప్రస్తుతం నీటిలో మునిగిపోయింది. ఇక్కడ పడుతున్న భారీ వర్షాలు ఆదేశాన్ని అల్లకల్లోలం చేశాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కెన్యాలో వానలు పడుతూనే ఉన్నాయి. మామూలుగానే కెన్యా ఏమీ అంత ధనిక దేశం కాదు. ఇప్పుడు ఈ వర్షాతో దాని పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయ్యింది. వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు 38 మంది చనిపోయారని కెన్యా రెడ్ క్రాస్ (Kenya Red Cross) సొసైటీ ప్రతినిధులు తెలిపారు. We are in Githurai 45, evacuating stranded families to safety after heavy rains last night. Our Red Cross teams from Kiambu and Nairobi have joined forces for the ongoing rescue efforts. pic.twitter.com/CTgPRyZ9A3 — Kenya Red Cross (@KenyaRedCross) April 24, 2024 కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కెన్యాలోని నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రమాదకర స్థాయిలు దాటి ప్రవహిస్తున్నాయి. ఆ నీరంతా నివాస ప్రాంతాలకు పోటెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు మొత్తం పూర్తిగా నీట మునిగాయి. దీనివల్ల దాదాపు లక్షమందికి పైగా ప్రజలు తమ ఇళ్ళను వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది. ప్రస్తుతం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్సాలు, వరదల కారణంగా కెన్యాలో మొత్తం 23 కౌంటీలు దెబ్బ తిన్నట్టు తెలుస్తోంది. Heavy rains across Kenya displaced thousands and killed at least 38 people, according to Kenya Red Cross Society data. The Meteorological Department warned more heavy rains are expected in the coming week and issued flood alerts pic.twitter.com/eU2ceE79Yw — Reuters (@Reuters) April 24, 2024 Also Read:China Phones : చైనీస్ మొబైల్స్‌లో లోపాలు..వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేస్తున్న యాప్‌లు #rains #floods #killed #kenya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి