తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైన అధికారం చేపట్టాలని కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు వచ్చిన రాహుల్ మరోమారు ఈనెలలో పర్యటించనున్నారు. ఈ నెల 17న తెలంగాణ కు ప్రియాంక ,రాహుల్ రానున్నారు. 17న నిజామాబాద్లో మహిళా డిక్లరేషన్ చేయనున్నారు. కాంగ్రెస్ ఈ సారి ఎలక్షన్స్లో మహిళల ఓట్లే కీలకమని భావిస్తోంది. అందుకే దాని మీద ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయింది కాంగ్రెస్. అప్పుడు కూడా మహిళా ఓటర్లకు గాలం వేసి గెలిచింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే చేయాలనుకుంటోంది. అందులో భాగంగా దసరా పండుగ, బతుకమ్మ రోజునే మహిళా డిక్లరేషన్ ఎనౌన్స్ చేయాలని భావిస్తోంది. 6 గ్యారంటీలకు అదనంగా ఇంకా కొత్త పథకాలు ప్రకటించనుంది.
రాహుల్, ప్రియాంక మూడు రోజుల పాటు తెలంగాణలోని ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ శాఖకు సమాచారం వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే.. టీ కాంగ్రెస్ నేతలు అందుకు కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నేపథ్యంలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన పార్టీలో కొత్త జోష్ నింపే అవకాశముందని శ్రేణులు అభిఫ్రాయపడుతున్నారు. అలాగే ఈ పర్యటనలో కాంగ్రెస్ అభ్యర్ధుల తుది జాబితా కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక తెలంగాణతో పాటూ మధ్యప్రదేశ్,చత్తీస్గఢ్,రాజస్తాన్ లలో కూడా ప్రియాంక, రాహుల్ టూర్ పర్యటించనున్నారు.
Also Read:వంద పతకాలతో చరిత్ర సృష్టించిన భారత్- అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ