Asian Games 2023: వంద పతకాలతో చరిత్ర సృష్టించిన భారత్- అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. వంద పతకాలను సాధించి కొత్త రికార్డును రాశారు. తాజాగా మహిళల కబడ్డీ జట్టు చైనాను ఓడించి స్వర్ణాన్ని దక్కించుకుంది. దీంతో భారత చిరకాల స్వప్నం నెరవేరింది. By Manogna alamuru 07 Oct 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Asian Games 2023: ఆసియాడ్ చరిత్రలో తొలిసారిగా ఇప్పుడు భారత్ ఖాతాలో 100 పతకాలు (100 Medals for India) చేరబోతున్నాయి. గతంలో 2018 ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన 70 పతకాలే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. ఇప్పటికే ఆ రికార్డు బద్దలు కాగా, ఇప్పుడు ఏకంగా 100 పతకాల మార్కు దిశగా భారత్ దూసుకుపోతున్నది. ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు. తాజాగా ఆర్చరీలో రెండు పసిడి పతకాలను భారత్ సాధించింది. పురుషుల కాంపౌండ్ ఈవెంట్ లో ఓజస్ ప్రవీణ్, మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాంగలో జ్యోతి సురేఖ బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో జ్యోతి సురేఖకు ఇది మూడో బంగారు పతకం. మరోవైపు మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అధితి గోపీచంద్ కు కాంస్యం దక్కించుకుంది. తాజా విజయాలతో భారత స్వర్ణపతకాల సంఖ్య 24కు చేరింది. ఇక మొత్తంగా ఇప్పటివరకు 99 పతకాలు(24 గోల్డ్, 35 సిల్వర్, 40 బ్రాంజ్) మొడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. ఆసియా క్రీడల్లో నిన్న ఇండియన్ హాకీ టీమ్ (Indian Hockey Team) జపాన్ను ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల్లో, హాకీలో భారత్ కు ఇది నాల్గవ పతకం. 1966,1998, 2014 తర్వాత మళ్ళీ ఇప్పుడొచ్చింది. దీంతో ఆసియా గేమ్స్ లో హాకీలో అత్యంత విజయవంతమైన పురుషుల జట్టుగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో పాకిస్తాన్ ఉంది. భారత హాకీ పురుషుల జట్టు ఈసారి అత్యున్నత ప్రదర్శనను కనబర్చింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ (Harmanpreet Singh) నాయకత్వంలో మొత్తం టోర్నమెంట్ అంతటా అసాధారణమైన ఫామ్ను ప్రదర్శించింది. సెమీ ఫైనల్స్ లో కొరియాను, ఫైనల్స్ లో జపాన్ను ఎక్కడా ఆధిక్యం ప్రదర్శించకుండా చేసింది. ఫైనల్ మ్యాచ్లో చివరి క్వార్టర్ ముగిసేసరికి భారత్ 5-1తో నిలిచింది. మరోవైపు భారత బ్యాడ్మింటన్ (Indian Badminton)పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో ఫఐనల్ కు చేరిన తొలి భారతీయ జోడీగా రికార్డు నెలకొల్పారు. సెమీ ఫైనల్స్ లో మాజీ ప్రపంచ ఛాంపియన్ ఆరోన్ చియా-సో వుయ్ యిక్ లపై గెలిచింది. తాజా ప్రదర్శనతో సాత్విక్-చిరాగ్ జోడీ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్ లో మొదటిసారి నంబర్ వన్ ర్యాంక్ కు చేరుకుంటారు. ఇక ఫైనల్లో చోయ్ సోల్ జియు-కిమ్ వన్ హో(దక్షిణ కొరియా) జంటతో సాత్విక్-చిరాగ్ ద్వయం తలపడుతుంది. భారత క్రీడకారులు వంత పతకాలు సాధించినందుకు ప్రధాని మోదీ (Narendra Modi) అభినందనలు తెలిపారు. భారత ప్రజలు థ్రిల్ ఫీల్ అయ్యారని తెలిపారు. భారత క్రీడాకారులు అధ్బుత ప్రదర్శన ఇచ్చారని మోదీ కొనియాడారు. A momentous achievement for India at the Asian Games! The people of India are thrilled that we have reached a remarkable milestone of 100 medals. I extend my heartfelt congratulations to our phenomenal athletes whose efforts have led to this historic milestone for India.… pic.twitter.com/CucQ41gYnA — Narendra Modi (@narendramodi) October 7, 2023 Also Read: కంగారులకు మూడినట్టే.. ఇక కాస్కో స్మిత్.. మా వాడితో మాములుగా ఉండదు మరి! #asian-games-2023-india-medals #hundred #asian-games-2023 #badminton #asian-games #medals #hockey #india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి