TELANGANA ELECTIONS:సమరానికి రెడీ అయిపోయిన బీఆర్ఎస్...రంగంలోకి కేసీఆర్
తెలంగాణలో అసెంబ్లీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో అన్ని పార్టీలు సమరానికి సై అంటున్నాయి. అందరికంటే ముందు బీఆర్ఎస్ ప్రచారంలోకి దిగిపోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. అక్టోబర్ 15 నుంచి 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.