Harish Rao: కేసీఆర్ లేకుంటే రేవంత్ సీఎం అయ్యేవాడా?.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన బిక్ష అని అన్నారు హరీష్ రావు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు.. రేవంత్ సీఎం అయ్యే వాడు కాదని పేర్కొన్నారు. తప్పుడు హామీలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్‌దే అని ధీమా వ్యక్తం చేశారు.

New Update
TS: కేసీఆర్ లాగే మీరూ చేయండి.. కాంగ్రెస్ కు హరీష్ రావు కీలక సూచన!

MLA Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. భద్రాచలం (Bhadrachalam) పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్, కాంగ్రెస్ (Congress), బీజేపీలపై (BJP) విమర్శల చేశారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) దేశానికి ప్రధాని మంత్రి కాలేడు అని అన్నారు. బీజేపీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మకైందని సంచలన ఆరోపణలు చేశారు.

ALSO READ: మాకు కూడా నోరు ఉంది.. చూస్కో రేవంత్.. కేటీఆర్ ఫైర్!

రేవంత్ సీఎం అయ్యేవాడు కాదు..

మాజీ మంత్రి హరీష్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసీఆర్ నాడు పెద్ద సభ పెడితే 35 రోజులు ఇక్కడే ఉన్నానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రస్థానంలో పూల బాటలు ఉన్నాయి, ముల్ల బాటలు ఉన్నాయి.. ఓటమి ఉంది, గెలుపు ఉందని అన్నారు. 2009 లో 10 స్థానాలు మాత్రమే గెలిచామని.. అధైర్యపడి ఉంటే తెలంగాణ వచ్చేది కాదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పిసిసి అయ్యేవాడు కాదు.. ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు అని అన్నారు.

కేసీఆర్ పెట్టిన భిక్ష..

రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని అన్నారు హరీష్. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది, ఆయనకు నేడు సీఎం పదవి వచ్చిందని అన్నారు. ఒక సీఎం.. అసభ్యంగా, అసహ్యంగా, అనాగరికంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. దేశంలోనే ఇంత అనాగరిక, సంస్కార రహిత, అనాగరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ నీతి మాటలు మాట్లాడటం తర్వాత, మీ సీఎం రేవంత్ రెడ్డికి నీతి చెప్పు అని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ ప్రధాని అయితే..

కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే హామీలు అమలు అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని హరీష్ పేర్కొన్నారు. 40 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అని మమతా బెనర్జీ అన్నారని.. నితీష్, మమత, కేజ్రీవాల్ దూరం అయ్యారని.. ఇండియా కూటమి కుప్పకూలిందని అన్నారు హరీష్. రాహుల్ ప్రధాని అవడం కలే అని ఎద్దేవా చేశారు. బీజేపీని నిలువరించే శక్తి ప్రాంతీయ పార్టీలకు ఉందని.. గల్లీలో, ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా, తెలంగాణ కోసం పోరాటం చేసేది బీఆర్ఎస్ ఎంపిలే అని పేర్కొన్నారు.

DO WATCH: 

Advertisment
Advertisment
తాజా కథనాలు