Telangana : తెలంగాణలో లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) ల పోలింగ్(Polling) దగ్గరికొస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ప్రచారాల్లో మునిగిపోయాయి. అత్యధికంగా ఎంపీ సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. అయితే ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రానున్నారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం 4.00 PM గంటలకు నర్సాపూర్, 6.00 PM గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు.
Also Read: పుష్ప సీన్ రిపీట్.. లారీ కింద రూ.8 కోట్ల 40 లక్షలు సీజ్
రాహుల్ గాంధీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలాఉండగా.. ఏప్రిల్ 19న ప్రారంభమైన ఈ పార్లమెంటు ఎన్నికలు జూన్ 1 వరకు జరగనున్నాయి. ఇప్పటికే మూడు దశల్లో పోలింగ్ ముగియగా.. ఇంకా నాలుగు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. తెలంగాణలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Also Read: నేటి నుంచి ఇంటర్ ప్రవేశాలు ప్రారంభం..