Andhra Pradesh : పుష్ప సీన్ రిపీట్.. లారీ కింద రూ.8 కోట్ల 40 లక్షలు సీజ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఇద్దరు దుండగులు లారీ కింద ఏర్పాటు చేసిన అరలో డబ్బులు తరలించేందుకు ప్రయత్నించారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకున్నారు. అందులో తనిఖీ చేయగా.. మొత్తం 8 కోట్ల 40 లక్షల రూపాయలు సీజ్ చేశారు. By B Aravind 09 May 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Pushpa Scene Repeat : ఏపీ(Andhra Pradesh) లోని ఎన్టీఆర్ జిల్లా(NTR District) జగ్గయ్యపేటలో పుష్ప(Pushpa) మూవీ సీన్ రిపీట్ అయ్యింది. ఇద్దరు దుండగులు లారీ కింద ఏర్పాటు చేసిన అరలో డబ్బులు తరలించేందుకు ప్రయత్నించారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకున్నారు. అందులో తనిఖీ చేయగా.. మొత్తం 8 కోట్ల 40 లక్షల రూపాయలు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు నగదు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. Also Read: శామ్ పిట్రోడా వివాదస్పద వ్యాఖ్యలు దుమారం.. అసలు ఎవరీనా ? అయితే ఆ ఇద్దరూ కూడా తమ యజమాని చెప్పినట్లుగా లోడ్‌ను తరలిస్తున్నామని పోలీసులకు చెప్పారు. అవి ఎవరివి ఎక్కడినుంచి వచ్చాయో అన్న విషయం తమకు తెలియదని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ లారీ యజమానికి సంబంధించిన వివరాలు రాబడుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం నాటికి ఆ డబ్బులు ఎవరివీ అన్న విషయంపై ఓ క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) ల వేళ.. ఇవి ఎన్నికల కోసం ఖర్చు చేసే డబ్బా అనే కోణంలో విచారణ జరుగుతోంది. Also Read: విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టును అనుమతి కోరిన జగన్ #money #pushpa #ap-news #lorry #telugu-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి