Rahul Gandhi: అలాంటి వాళ్లు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవడం మంచిందే: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండేవాళ్లు తమ పార్టీలో నుంచి వెళ్లిపోయినా తమకు ఇబ్బంది పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హిమంత, మిలింద్ దేవరా లాంటి వ్యక్తులు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలనుకున్నారని.. ఇలాంటి వాళ్లు అలా వెళ్లిపోవడం పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

New Update
National: ప్రియాంక పోటీ చేసి ఉంటే మోదీ ఓడిపోయేవారు-రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండేవాళ్లు తమ పార్టీలో నుంచి వెళ్లిపోయినా తమకు ఇబ్బంది లేదన్నారు. శుక్రవారం తాను చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో డిజిటల్ మీడియా వారియర్స్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అస్సాంలో కాంగ్రెస్ పతనం, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురించి అడిగిన ప్రశ్నకు రాహుల్ సమాధానమిచ్చారు. హిమంత, మిలింద్ దేవరా లాంటి వ్యక్తులు కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలనుకున్నారని.. ఇలాంటి వాళ్లు అలా వెళ్లిపోవడం పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అలాంటి వారు పార్టీ మారడమే సరైందేనని తెలిపారు.

Also read: వారణాసిలో గెలిచి సత్తా చూపించండి…లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 40 సీట్లు కూడా క‌ష్ట‌మే..!!

అత్యంత అవినీతి సీఎం హిమంత

హిమంత బిశ్వ శర్మ విచిత్రమైన నాయకుడని.. అలాంటి వ్యక్తి అసలు కాంగ్రెస్ సిద్ధంతాలకు సరిపోడని విమర్శించారు. అతను ముస్లింలపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమని చెప్పారు. తాను కాపాడాలనుకుంటున్న విలువలకు అతని చేసిన వ్యాఖ్యలు చాలా వ్యతిరేకమన్నారు. ఇదిలాఉండగా.. ఇటీవలే సీఎం హిమంత బిశ్వ శర్మ.. రాహుల్ గాంధీలు ఒకరినొకరు విమర్శలు చేసుకున్నారు. రాహుల్.. భారత్‌ జోడో న్యాయ యాత్ర ద్వారా అస్సాంలో అలజడి సృష్టించాలని చూశారంటూ హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. దీనిపై స్పందించిన రాహుల్‌.. అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి హిమంత అంటూ విమర్శలు గుప్పించారు.

ఎలాంటి ప్రభావం ఉండదు

అయితే ఇటీవల మహారాష్ట్రలో మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేశారు. అనతంరం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. ముంబై సౌత్‌ నియోజకవర్గానికి సంబంధించి.. ఇండియా కూటమి సీట్ల పంపకాల పట్ల అసంతృప్తి చెందిన ఆయన పార్టీ మారిపోయారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీలో విలువలు లేని అలాంటి నేతలు వెళ్లిపోవడం అనేది విపక్ష ఇండియా కూటమిపై కూడా ఎటువంటి ప్రభావం ఉండదని రాహుల్ అన్నారు.

Also Read: పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..లోపలే కార్మికులు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు