Fire accident: పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..లోపలే కార్మికులు..!! హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలోని బడ్డి పారిశ్రామిక వాడలోని ఓ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మహిళలు సహా పలువురు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. By Bhoomi 02 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Fire accident: హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలోని బడ్డి ప్రాంతంలోని పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 50 మందికి పైగా కార్మికులు ఉన్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మహిళలు సహా పలువురు కార్మికలు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నారు. చాలా మంది ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు.ఫ్యాక్టరీలో 50 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఎన్డిఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. #WATCH | 41 people including 19 injured people were rescued after a fire broke out in a perfume factory in the Baddi area of Solan district today; Teams of NDRF and Fire Department engaged in the operation to rescue affected persons and douse fire#HimachalPradesh pic.twitter.com/A1l6ypP5HI — ANI (@ANI) February 2, 2024 ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 19 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. నాలాగఢ్ సహా సమీపంలోని పలు ప్రాంతాల నుంచి పలు ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయని సోలన్ జిల్లా డిప్యూటీకమిషనర్ మన్మోహన్ శర్మ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కూడా ఘటనాస్థలానికి చేరుకుందన్నారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికులు ప్రాణభయంతో భవనం పై అంతుస్తుకు వెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఇది కూడా చదవండి: వారణాసిలో గెలిచి సత్తా చూపించండి…లోక్సభ ఎన్నికల్లో 40 సీట్లు కూడా కష్టమే..!! అటు ఫ్యాక్టరీలో కాస్మోటిక్స్ మెటీరియల్ ఉండటంతో పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దాంలో మంటలు ఆర్పేందుకు అటంకాలు ఎదురవుతున్నాయని కమిషనర్ తెలిపారు. #cosmetic-factory #telugu-news #himachal-pradesh #fire-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి