/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-48-2.jpg)
ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి ఆలయంలో 46 ఏళ్ల తర్వాత రత్నభాండాగారం తలుపులు తెరుచుకున్న సంగతి తెలసిందే. శతాబ్దాలుగా రాజులు, భక్తులు కానుకగా సమర్పించిన వజ్రాభరణాలు, వెండి, బంగారు నిల్వలను తనిఖీ చేయనున్నారు. భక్తలకు కనిపించని ఈ రత్నభాండాగారంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. పురుషోత్తముడి గర్భగుడి వెనుక శయన స్వామి మందిరం ఉంది. శయన మందిరానికి ఎడమవైపున స్ట్రాంగ్ రూమ్ ఉంది. జగన్నాథుడి రత్న భాండాగారంలో మూడు గదులు ఉన్నాయి. ఆ రహస్య గదుల్లో దీపాలు లేవు. అంతా చీకటిగా ఉంది. తొలి గదిలో స్వామి నిత్యసేవలకు అవసరమైన ఆభరణాలు ఉన్నాయి.
రెండో గదిలో పండుగలు, యాత్రల్లో ముగ్గురు మూర్తులకు తొడిగే అలంకారాలు ఉన్నాయి. ఇక మూడో గదిలో ఉన్న చెక్కపెట్టెల్లో వెలకట్టలేని సంపద ఉంది. శ్రీ క్షేత్రానికి రక్షణగా మహాశక్తి విమలు, మహాలక్ష్మీలు కాపలా ఉన్నారని భక్తులు నమ్ముతుంటారు. ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి. మళ్లీ 5.20 PM గంటలకు తలుపులు వేసి అధికారులు బయటికి వచ్చారు. రెండు గదుల్లోని సంపద తరలింపుకే ఎక్కువ సమయం పట్టింది. భాండాగారం మూడో గది తాళం తెరుచుకోకపోవడంతో భారీ కట్టర్స్ సాయంతో అధికారులు తెరిచారు. అప్పటికే సమయం మించిపోవడంతో మూడో గదికి సీల్ వేశారు. కమిటీ మీటింగ్ తర్వాత మళ్లీ గది తలుపులు తెరుస్తామని అధికారులు ప్రకటించారు.
Also Read: ఆగస్టు చివరినాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి యూ-విన్
అయితే లోపల ఇత్తడి పూత ఉన్న ఆరు కొత్త చెక్కపెట్టెల్లో మొదటి రెండు గదుల్లోని ఆభరణాలను అధికారులు బయటకు తెచ్చారు. అవన్నీ టేకుతో చేసినవి. టేకుతో తయారుచేసిన ఆ చెక్కపెట్టెల పొడవు 4.5 అడుగులు. ఎత్తు 2.5అడుగులు, వెడల్పు 2.5అడుగులు. మొత్తం 15 పెట్టెలు తయారు చేయాలని అధికారులు వాటిని రూపొందించే కార్మికులకు చెప్పారు. దీంతో వాళ్లు 48 గంటల్లో 6 పెట్టెలను తయారు చేశారు. ఆ తర్వాత రహస్య మందిరాన్ని తెరిచి లోపల ఉన్న పరిస్థితిని అధికారులు పరిశీలించారు. కర్రపెట్టెలు, పురాతన కాలం నాటి అల్మారాల్లో ఉన్న స్వామివారి సంపదను గమనించారు. అయితే అప్పటికే సమయం దాటిపోయి చీకటి పడటంతో.. రహస్య గదిలోని ఆభరణాల తరలింపు సాధ్యం కాదని.. మళ్లీ మేజిస్ట్రేట్ సమక్షంలో గదులకు సీల్ వేసి సాయంత్రం 5.20 గంటకు బయటకు వచ్చేశారు.
మూడో రహస్య గదిని చివరిసారిగా 1978లో తెరవగా.. మళ్లీ 46 ఏళ్లకి ఇప్పుడే తెరిచారు. 2018లో ఒడిశా హైకోర్టు ఆదేశాలతో దీన్ని తెరిచేందుకు యత్నించినా.. తాళాలు కనబడక అప్పుడు ఆపేశారు. చివరికి ఇప్పుడు తెరుచుకుంది. ఈ సందర్భంగా జస్టిస్ రథ్, పాలనాధికారి అరవింద పాఢి మీడియాతో మాట్లాడారు. ' తొలి రెండు గదుల్లోని ఆభరణాలను చంగడా గోపురానికి తరలించేందుకు ఎక్కువ సమయం పట్టింది. రహస్య గదిలో సంపదను గర్భగుడికి సమీపంలో ఉన్న పూలగదికి తరలించిన అనంతరం పురావస్తుశాఖ భాండాగారం మరమ్మతులను ప్రారంభిస్తుంది. ఈ పనులు పూర్తయ్యాక ఆభరణాలను మళ్లీ భాండాగారానికి తెచ్చి లెక్కింపు చేపడతాం. రూల్స్ ప్రకారం తొలిరోజు కార్యక్రమం చేపట్టాం. మళ్లీ భాండాగారం తెరవడానికి శ్రీక్షేత్ర పాలకవర్గం తేదీపై నిర్ణయం తీసుకుంటుంది.
Also Read: టూరిస్టుల బట్టలెత్తుకెళ్లిన పోలీసులు.. ఎక్కడంటే ?
సోమవారం జగన్నాథుడి బహుడా యాత్ర, బుధవారం సున్నాభేషో వేడుకలు జరగనున్నాయి. మరో తేదీని నిర్ణయించి భాండాగారం తెరిచి అందులో ఉన్న సంపదను స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తాం. తాత్కాలికంగా శ్రీక్షేత్రంలో ఏర్పాటు చేసిన రెండు స్ట్రాంగ్ రూమ్‌లకు సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. అయితే సంపదను లెక్కించేందుకు ఎన్ని రోజులు సమయం పడుతుందని ఇప్పుడే చెప్పలేం. అలాగే ఈ ప్రక్రియ వల్ల పురుషోత్తముని సేవలు, భక్తుల దర్శనాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశామని' తెలిపారు.