Waterfalls : టూరిస్టుల బట్టలెత్తుకెళ్లిన పోలీసులు.. ఎక్కడంటే ?

కర్ణాటకలోని ముడిగేరిలో ఉన్న చార్‌మడి జలపాతం వద్ద పర్యాటకులకు స్నానం చేయడాన్ని ప్రభుత్వం నిషేధించినా కొంతమంది టూరిస్టులు స్నానాలు చేశారు. దీంతో పోలీసులు వారి బట్టలను తీసుకెళ్లారు. టూరిస్టులు పోలీసులను వేడుకోవడంతో.. చివరికి హెచ్చరించి బట్టలు తిరిగిచ్చేశారు.

New Update
Waterfalls : టూరిస్టుల బట్టలెత్తుకెళ్లిన పోలీసులు.. ఎక్కడంటే ?

Tourists Cloths Taken By Police : చాలామంది ఉల్లాసం కోసం, సంతోషంగా గడపడం కోసం పర్యాటక ప్రదేశాలకు (Tourist Places) వెళ్తుంటారు. అయితే కొంతమంది ఆ ప్రదేశాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే హెచ్చరికలను పట్టించుకోరు. ఇలానే పట్టించుకొని కొందరు పర్యాటకులు పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక (Karnataka) లోని ముడిగేరిలో ఉన్న చార్‌మడి జలపాతం వద్ద పర్యాటకులకు స్నానం చేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది.

Also Read: ఆగస్టు చివరినాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి యూ-విన్

అయినా కూడా అక్కడికి వచ్చిన కొంతమంది టూరిస్టులు దీన్ని పట్టించుకోలేదు. అక్కడే స్నానాలు చేయడం ప్రారంభించారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు. జలపాతం కింద ఆ పర్యటకులు విడిచివెళ్లిన దుస్తులను పోలీసులు తీసుకొని పోయారు. ఆ తర్వాత తమ బట్టలు తిరిగి ఇచ్చేయాలంటూ అర్ధనగ్నంగా ఆ పర్యాటకులు పోలీసులు వేడుకున్నారు. చివరికి పర్యాటకులను గట్టిగా హెచ్చరించిన తర్వాత వారి బట్టలు ఇచ్చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా (Social Media) లో కూడా వైరలయ్యాయి. పోలీసులు విధించిన ఈ చిన్నపాటి శిక్షపై నెటీజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: భయపెడుతున్న డెంగ్యూ.. ఏడుగురు మృతి

Advertisment
తాజా కథనాలు