Pregnant Women: ప్రతిరోజూ వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికి తెలిసిందే. అయితే.. గర్భవతి కూడా కచ్చితంగా నడవాలని నిపుణులు చెబుతారు. నడక గర్భధారణ సమయంలో అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతోపాటు అనేక రకాల సమస్యలను కూడా నివారిస్తుందంటున్నారు. కొందరికీ నడక మంచిదేనా..?, ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా అని డౌట్ కొందరికి ఉంటుంది. అయితే.. ఏదైనా ఎక్కువ తీసుకోవడం హానిగా ఉంటుంది. ఆ సమయంలో అధిక నడక కూడా ప్రతికూలతలను కలిగి ఉంటుంది. గర్భవతి ఈ సమయంలో ఎంతసేపు నడవాలి అనేది ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. గర్భధారణ సమయంలో అతిగా నడవడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
గర్భిణీ స్త్రీలు ఎంత సమయం నడవాలి:
- గైనకాలజిస్ట్స్ నిపుణులు అభిప్రాయం ప్రకారం..గర్భిణీ స్త్రీ ప్రతివారం 150 నిమిషాల మితమైన ఇంటెన్సిటీ ఏరోబిక్ వ్యాయామం చేయాలంటున్నారు. ఇందులో బ్రిస్క్ వాక్ కూడా ఉంటుంది. గర్భిణీ స్త్రీ ప్రతిరోజూ 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు వ్యాయామం చేయాలి లేదా నడవాలని శారీరక శ్రమ నిపుణులు అంటున్నారు.
ఎక్కువ నడవడం వల్ల నష్టాలు:
- గర్భిణీ స్త్రీ అతిగా నడవడం వల్ల అలసట, కటి ప్రాంతంపై ఒత్తిడి, నొప్పి, తొడలు, అరికాళ్ళలో నొప్పి, కీళ్ల నొప్పుల ప్రమాదం వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. ఈ సమయంలో నడిచే మహిళలు చాలా త్వరగా అలసిపోతారు. అందుకని గర్భదారణ సమయంలో రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే మంచిదంటున్నారు. ఎక్కువ నడవడం మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
నడక కోసం చిట్కాలు:
- గర్భవతి కావడానికి ముందు కూడా వ్యాయామం చేస్తుంటే.. ప్రతి వారం కనీసం 150 నిమిషాల శారీరక శ్రమతోపాటు..నడకను చేస్తే మంది. గర్భధారణ తర్వాత వ్యాయామం చేయాలనుకుంటే.. నెమ్మదిగా ప్రారంభిచాలని అంటున్నారు.
మ్యూజిక్ వింటూ నడక బెస్ట్:
- గర్భవతి ఎక్కువగా నడకకు వెళ్తుంటే.. సౌకర్యవంతమైన బూట్లు వేసుకోసి పాటలు వినటం మంచిది. నీడలో నడవాలి.. ఎండలో ఎక్కువ నడవటం మానుకోవాలి. వాకింగ్ చేసే సమయంలో నీరు, స్నాక్స్ వంటి పక్కన తీసుకువెళ్లాలని చెబుతున్నారు.
ఎక్కవ లాభాలు:
- గర్భధారణ టైంలోనే కాకుండా సాధారణంగా కూడా వాకింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే.. గర్భం చివరి దశ రోజులలో నడవడం వల్ల ప్రసవ నొప్పి మొదలైతుంది. లింట్‌గా వాకింగ్ చేస్తే ప్రసవ నొప్, సిజేరియన్ ప్రమాదం కూడా తగ్గుతుంది. అందుకని గర్భధారణ సమయంలో రోజుకు 30 నిమిషాలు నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: టొమాటోను వీటితో కలిపితే ఖరీదైన బ్యూటీ ప్రోడక్ట్ అవుతుంది.. తెలుసా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.