పవన్ కల్యాణ్ ను కలిసిన రాజేంద్ర ప్రసాద్.. నవ్వులే నవ్వులు-PHOTOS
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
ఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్‌రావు(రాజబాబు) ఈ రోజు మృతి చెందారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజాబాబు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు.
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీపై తిరగబడ్డారు. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంజూరు చేయించిన ఫ్లై ఓవర్ ను ఆపేయడంపై భగ్గుమంటున్నారు. తాను ఎవరికీ భయపడనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
కొంతమంది తనపై అబద్ధపు ప్రచారాలు చేసి, పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను కొందరికి నచ్చకపోవచ్చని.. మరి కొందరు తనను అంగీకరించకపోవచ్చన్నారు. ఎవరు ఏమనుకున్నా తాను పట్టించుకోనన్నారు.
వల్లభనేని వంశీ అరెస్ట్ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వంశీ జైలుకు వెళ్లాడన్నారు. తప్పు చేసిన వైసీపీ నేతలందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామని స్పష్టం చేశారు. వంశీపై కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ను నియమించింది. దీపా దాస్ మున్షీ స్థానంలో ఆమెను నియామకమయ్యారు. మీనాక్షి మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని బిర్లాగ్రామ్ నాగ్డాలో జన్మించారు. ఈమె 2009 -2014 మాండ్సౌర్ MPగా ఉన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు అలిగారని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు.
తమ నేతలను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఏపీలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందన్నారు. అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వంశీ భద్రతకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏ క్షణమైనా నాని అరెస్ట్ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. మరో వైపు వల్లభనేని వంశీపై మరో 6 కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.