BIG BREAKING: 'బండి సంజయ్ పై క్రిమినల్ కేసు!'

కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

New Update
Bandi Sanjay Vs KCR

Bandi Sanjay Vs KCR

కేంద్ర మంత్రి బండి సంజయ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్ రెడ్డి, కె .కిషోర్ గౌడ్, కురువ విజయ్ కుమార్, అభిలాష్ రంగినేని, వెంకటేష్ తదితరులు ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు