🔴Live Breakings: తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానలు... ఆరెంజ్ అలర్ట్ జారీ
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
పాస్టర్ ప్రవీణ్ కేసులో తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిని రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఇది హత్యే అని వాదిస్తున్న వారికి నోటీసులు ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రూఫ్స్ ఇవ్వాలని కోరుతున్నారు.
పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించి మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. వైన్స్ లోకి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆయనను ఫొటో తీశాడు. ఈ సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అతను ఎందుకు వీడియో తీశాడు? ఎవరికి పంపించాడు? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
BRS అధికారంలో ఉన్న సమయంలో HCU సమీపంలోని సర్వే నం.25లో మై హోం విహంగకు 25 ఎకరాలు కట్టబెట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. రెండు భవనాలకే వంద ఫీట్ల రోడ్డు వేశారని ధ్వజమెత్తారు. మై హోం విహంగ విద్యార్థి నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు.
కంచె గచ్చిబౌలిలోని భూములు అమ్మడం కుదరదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరన్నారు. ఇలా చెట్లను నరికివేయవద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్నారు. తక్షణమే భూముల అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు.
త్వరలో ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేస్తాడని శివసేన (యూబీటీ) MP సంజయ్ అన్నారు. అది చెప్పడానికే RSS ప్రధాన కార్యాలయానికి ఉగాది రోజు వెళ్లారని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ తర్వరలో బీజేపీ కొత్త ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తోందని సంజయ్ రౌత్ చెప్పారు.