Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఈరోజు నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. కాగా రేపు ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి.
ఈరోజు నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. కాగా రేపు ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి.
డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ ను జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఆమె అధ్యక్ష అధికారాలను గతంలోనే నిర్వర్తించారు. 2021లో అధ్యక్షుడు జో బైడెన్ అనారోగ్యానికి లోనయ్యారు.ఆ సమయంలో కమలా సుమారు 85 నిమిషాల పాటు దేశాధ్యక్షురాలి బాధ్యతలను నిర్వర్తించారు.
కమలా హ్యారిస్ మరోసారి టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తప్పుకున్నారు. ఆ వెంటనే కమలను డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో బైడెన్ వర్సెస్ ట్రంప్ పోరు కాస్త కమల వర్సెస్ ట్రంప్ ఫైట్‌గా మారింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కలిశారు. ఈ విషయాన్నిట్విటర్ ఖాతా ద్వారా ఎంపీ విజయ సాయి రెడ్డి వెల్లడించారు. గవర్నెన్స్, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన పలు విషయాలపై అమిత్ షాతో చర్చించినట్లు విజయసాయిరెడ్డి వివరించారు.
కొంత కాలం క్రితం ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫాంహౌస్ లో బంధించి హింసించిన విషయం తెలిసిందే. ఆ ఫాంహౌస్‌కు అనుమతులు లేవని మునిసిపల్ సిబ్బంది గుర్తించారు.ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండడంతో అధికారులు దానిని కూల్చి వేశారు.
వైఎస్ జగన్ ఇంకా ముఖ్యమంత్రి భ్రమలోనుంచి బయటపడట్లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తత్వం బోధపడినట్లు లేదంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్ కుట్రలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మదనపల్లె ఆర్డీవో కార్యాలయాన్నిడీజీపీ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ ఘటన యాక్సిడెంట్ కాదని.. ఇన్సిడెంట్‌లా కనిపిస్తోంది.కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. ఆఫీసు బయట కూడా పలు ఫైల్స్ కాలిపోయినట్లు గుర్తించినట్లు డీజీపీ తెలిపారు.
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి నదీ జలాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లను నింపే పనుల కోసం రూ.6 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమితులయ్యారు. పార్టీ చీఫ్ విప్ గా లోకం నాగ మాధవి, కోశాధికారిగా పులపర్తి రామాంజనేయులుకు అవకాశం దక్కింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పీకర్ కు సమాచారం అందించారు.