Kamala Harris: 85 నిమిషాల పాటు దేశాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్! డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ ను జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఆమె అధ్యక్ష అధికారాలను గతంలోనే నిర్వర్తించారు. 2021లో అధ్యక్షుడు జో బైడెన్ అనారోగ్యానికి లోనయ్యారు.ఆ సమయంలో కమలా సుమారు 85 నిమిషాల పాటు దేశాధ్యక్షురాలి బాధ్యతలను నిర్వర్తించారు. By Bhavana 22 Jul 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Kamala Harris: డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ ను జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కమలా హ్యారిస్ కానీ .. డెమోక్రటిక్ నామినేషన్ గెలిచి, ఆ తర్వాత నవంబర్‌లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే, అమెరికాలో అధికారం చేపట్టిన తొలి మహిళా అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ అమెరికా లో చరిత్ర సృష్టించిన వారు అవుతారు. కానీ ఆమె అధ్యక్ష అధికారాలను గతంలోనే నిర్వర్తించారు. 2021లో అధ్యక్షుడు జో బైడెన్ అనారోగ్యానికి లోనయ్యారు. ఆ సమయంలో కమలా హ్యారిస్ సుమారు 85 నిమిషాల పాటు దేశాధ్యక్షురాలి బాధ్యతలను నిర్వర్తించారు. అధ్యక్ష అధికారాలను ఆమె వినియోగించుకున్నారు.సుమారు గంటకు పైగా అధికారంలో ఉన్న కమలా హ్యారిస్.. వైట్‌హౌజ్ లోని వెస్ట్ వింగ్ ఆఫీసు నుంచి తన విధులను నిర్వర్తించారు. అప్పటి వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ అధికార మార్పిడి గురించి తెలిపారు. అమెరికా రాజ్యాంగంలో ఉన్న విధానాల ప్రకారమే .. స్వల్ప సమయం పాటు అధికారాన్ని అప్పగించడం జరిగిందన్నారు. అమెరికా రాజ్యాంగంలోని 25వ అధికరణ ప్రకారం.. ఒకవేళ దేశాధ్యక్షుడు ఆఫీసు నుంచి వైదొలిగినా, లేక మరణించినా, లేక రాజీనామా చేసినా, ఆ సమయంలో ఉపాధ్యక్షులు.. అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారని వివరించారు. #elections #kamala-haris #america #biden మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి