రాజకీయాలకు గుడ్‌బై.. పోసాని సంచలన ప్రకటన
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లనని.. చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని పోసాని తెలిపారు.
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లనని.. చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని పోసాని తెలిపారు.
మున్సిపల్ చట్టానికి సవరణలు తీసుకువచ్చేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకు మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఎన్నికైన 4 ఏళ్ల తర్వాత మాత్రమే వారిపై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ గడువును రెండున్నరేళ్లకు తగ్గించేలా మార్పులు తేనున్నారు.
ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలతో పాటు వక్ఫ్ బోర్డు సవరణ-2024 కీలక చట్టాలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ బోర్డుపై గత కొంత కాలం నుంచి ఫిర్యాదులు వస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు . నీ బతుకెంతా.. ప్రధాని మోదీపై విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు హామీలను నెరవేర్చడం లేదన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ కీలక నేత, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇదే కేసులో శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై MIM నేత ముబాషీర్ హైదరాబాద్ సీపీకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారనే వ్యాఖ్యలపై కంప్లైంట్ చేశారు. అయితే దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు.
గ్రూప్-3 పరీక్షలో తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పదాలతో కూడిన ప్రశ్నలను అడగడంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ప్రశ్నాపత్రాల్లోనే ఇలాంటి పదాలు ఉంటే సామాజిక న్యాయం ఎలా సాధ్యమంటూ రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు.
మహిళల మానప్రాణాల మీద టీడీపీ, వైసీపీ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. మహిళలపై క్రైమ్ రేట్ అరికట్టలేని YCP, TDP సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఏపీ అభివృద్ధిలో చివరి స్థానం, మహిళలపై అఘాయిత్యాలలో, ప్రథమ స్థానంలో ఉందని ఫైర్ అయ్యారు.