సిగ్గుతో తలదించుకోండి.. టీడీపీ, వైసీపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!

మహిళల మానప్రాణాల మీద టీడీపీ, వైసీపీ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. మహిళలపై క్రైమ్ రేట్ అరికట్టలేని YCP, TDP సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఏపీ అభివృద్ధిలో చివరి స్థానం, మహిళలపై అఘాయిత్యాలలో, ప్రథమ స్థానంలో ఉందని ఫైర్ అయ్యారు.

New Update
Sharmila ys Jagan

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు , అఘాయిత్యాలను అరికట్టడంలో గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ రోజు శాసనమండలిలో జరిగిన చర్చనే ఇందుకు నిదర్శనమన్నారు. 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో నమోదైనవి 83,202 కేసులట.. 2019 నుంచి 24 వరకు 1,00,508 కేసులట.. అంటూ ఫైర్ అయ్యారు. తమ పాలనలో కంటే వైసీపీ హయాంలోనే 20 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని టీడీపీ... లేదు లేదు కూటమి అధికారంలో వచ్చాకే రోజుకు సగటున 59 అత్యాచారాలు నమోదు అని వైసీపీ నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారన్నారు. ఇలా వ్యాఖ్యలు చేస్తూ మహిళల మానప్రాణాల మీద రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు.


ఇది కూడా చూడండి: BIG BREAKING: వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు

ఇది కూడా చూడండి:  అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్

అమలుకు నోచుకోని చట్టాలు..

గడిచిన 10 ఏళ్లలో సుమారు 2 లక్షల కేసులు నమోదు అయ్యాయంటే.. మహిళలకు భద్రత కల్పించడంలో మన రాష్ట్రం ఎక్కడుందో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై క్రైమ్ రేట్ అరికట్టలేని వైసీపీ, టీడీపీలు రెండు దొందు దొందేనన్నారు. ఇది నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమన్నారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు పేరుకే తప్పా అమలుకు నోచుకోలేదన్నారు. నిర్భయ చట్టం ప్రకారం మహిళలపై వికృత చేష్టలకు పాల్పడితే 40 రోజుల్లో కఠిన శిక్షలు అని చంద్రబాబు, దిశ చట్టం కింద 20 రోజుల్లోనే ఉరి శిక్ష పడేలా చర్యలని జగన్ మహిళల చెవుల్లో క్యాలి ఫ్లవర్లు పెట్టారన్నారు. అంతే కానీ చట్టాలను అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. 

ఇది కూడా చూడండి:  BIG BREAKING: హైదరాబాద్‌లో ఐటీ దాడులు

భద్రతకు పెద్ద పీట అనే ఆర్భాటపు ప్రచారాలు తప్పా..10 ఏళ్లలో ఏ ఒక్క నేరస్థుడికీ కఠిన శిక్షలు పడలేదన్నారు. ఈ కేసులు ఛేదించాల్సిన పోలీసులను కక్ష్య సాధింపు రాజకీయాలకు వాడుతున్నారు తప్పిస్తే.. ఏనాడూ సక్రమంగా విధులు నిర్వర్తింపజేసింది లేదన్నారు. అభివృద్ధిలో చివరి స్థానం.. మాదక ద్రవ్యాల వాడకంలో, మహిళలపై అఘాయిత్యాలలో, ప్రథమ స్థానం.. ఇదీ మన రాష్ట్ర దుస్థితి అంటూ టీడీపీ, వైసీపీపై దుమ్మెత్తి పోశారు షర్మిల. 

ఇది కూడా చూడండి: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలకనేత

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు