రాజకీయాలకు గుడ్‌బై.. పోసాని సంచలన ప్రకటన ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లనని.. చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని పోసాని తెలిపారు. By Kusuma 21 Nov 2024 in రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి పోసాని కృష్ణమురళీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఇక జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లనని తెలిపారు. చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని పోసాని తెలిపారు. ఇకపై ఎలాంటి రాజకీయాల గురించి మాట్లాడనని తెలిపారు. ఏ రాజకీయ పార్టీని తిట్టను, పొగడని ఇటీవల తెలిపారు. అయితే ఇటీవల పోసానిపై ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కారణంతోనే రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నారని సమాచారం. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లనని.. చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని పోసాని తెలిపారు.Read More:https://t.co/xMcKtF12ic#PosaniKrishnaMurali #Politics #RTV — RTV (@RTVnewsnetwork) November 21, 2024 ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్! అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు.. ఇదిలా ఉండగా ఇటీవల పోసానిపై ఏపీలో కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారం చేశారని రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పోసాని వ్యాఖ్యలు ఉన్నాయి. రెండు వర్గాల మధ్య గొడవలు వచ్చే విధంగా పోసాని మాట్లాడారన్నారు. ఇది కూడా చూడండి: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్! పోసానిపై కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ సీఐడీని కోరారు. దీంతో పోసాని మురళికృష్ణపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ యాక్ట్ 111, 196, 353, 299, 336(3)(4), 341, 61(2) సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది కూడా చూడండి: బద్దశత్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా? ఇదిలా ఉండగా.. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌తో పాటు మరికొందరిపై అసభ్యకర వ్యాఖ్యాలు చేశారు. ఇందులో భాగంగా పోసానిపై పలు స్టేషన్‌లో మొత్తం 5 చోట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇది కూడా చూడండి: AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..? #posani-krishna-murali మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి