రేవంత్ ప్రభుత్వానికి షాక్..సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ తెలంగాణ లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసి.. దీనిపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ తెలిపింది. పరిశీలన కోసం తమ బృందాన్ని లగచర్లకు పంపాలని ఎన్‌హెచ్‌ఆర్సీ నిర్ణయించింది. By Kusuma 21 Nov 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని తెలిపింది. లగచర్లకు తమ బృందాన్ని పరిశీలన కోసం పంపాలని ఎన్‌హెచ్‌ఆర్సీ నిర్ణయించింది. గ్రామస్తులపై వేధింపులు, తప్పుడు కేసులు పెట్టారన్న ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఆర్సీ స్పందించింది. ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్! గ్రామ ప్రజలంతా ఒక్కసారిగా కలెక్టర్‌పై.. ఇదిలా ఉండగా.. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణకు ఈ నెల 11వ తేదీన కలెక్టర్, ఇతర అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈక్రమంలో కొందరు రైతులు గ్రామంలోని ప్రజలతో చర్చలు జరపాలని కోరారు. దీంతో గ్రామానికి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై ఒక్కసారిగా కొందరు ప్రజలు దాడులకు దిగారు. ఇది కూడా చూడండి: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్! అధికారుల వాహనాలను కూడా పెద్ద పెద్ద రాళ్లతో ధ్వంసం చేశారు. వెంటనే డీఎస్పీపై బదిలీ వేటు పడింది. ఈ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు అనేక మంది రైతులను అరెస్ట్ చేశారు. ఇది కూడా చూడండి: బద్దశత్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా? నిఘా వర్గాలతో పాటు స్థానిక పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరగడానికి వారం ముందు నుంచే గ్రామంలో కొందరు సమావేశాలు నిర్వహించి రెచ్చగొట్టినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు సురేష్‌ను హాజరు పరిచారు. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ తెలిపింది. దీనిపై నివేదిక వచ్చిన తర్వాతే పూర్తిగా తెలుస్తుంది. ఇది కూడా చూడండి: AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..? #cm-revanth-reddy #big-shock #lagacharla issue #NHRC మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి