జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు MIM నేత ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారని పవన్ కళ్యాణ్ అనడం కరెక్ట్ కాదని MIM నేత ముబాషీర్ అన్నారు. తమను అవమానించేలా కామెంట్స్ చేసినందుకు పవన్‌పై కేసు నమోదు చేయాలని సోషల్ మీడియా వేదికగా ముబాషీర్ కోరారు. అయితే దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని హైదరాబాద్ సీపీ ఆనంద్ స్పందించారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు
ఎన్నికల ప్రచారంలో పాల్గొని..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమి తరపున మహారాష్ట్రలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాందేడ్ జిల్లా దెగ్లూరులో మాట్లాడుతూ.. మహారాష్ట్ర చరిత్రలో ఎందరో గొప్పవారు ఉన్నారు. సనాతన ధర్మాన్ని పోరాడారు.
ఇది కూడా చూడండి: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలకనేత
అలాంటి వారి ఆశయాలను దెబ్బతీస్తున్న అసాంఘిక శక్తులను తరిమికొట్టే ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్డీయే పదేళ్ల పాలనలో ప్రపంచ పటంపై జెండా ఎగురుతోంది. అంతా దేశాన్ని అభివృద్ధి చేశారు. దేశం మొత్తం అభివృద్ధి దిశలో పయనిస్తోందని ఇంకా అభివృద్ధి చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ మహారాష్ట్ర ప్రచారంలో వ్యాఖ్యానించారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: హైదరాబాద్‌లో ఐటీ దాడులు
హైదరాబాద్‌లో ఉండే కొందరు నేతలు పోలీసులు 15 నిమిషాల పాటు కళ్లు మూసుకుంటే హిందువులకు మేమేంటో చూపిస్తామని అంటారు. మనకు ఇలాంటి ప్రభుత్వాలు వద్దని.. ఎన్నికల్లో విడిపోయి బలహీనపడదామా? లేకపోతే కలిసి బలంగా నిలబడదామని పవన్ కళ్యాణ్ అన్నారు. విడిపోయి హిందువుల అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా? లేకపోతే కలిసి బంగారు భవిష్యత్తును నిర్మించుకుందామని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఇవి దుమారం రేపుతున్నాయి.
ఇది కూడా చూడండి: అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్