పవన్ నోట గద్దర్ పాట.. | Deputy CM Pawan Kalyan | Gaddar Song | Maharastra | RTV
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బీజేపీ మరో కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి తరుఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కమలా హారిస్, ట్రంప్ తమ ప్రచారాలతో ఊదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో లేబర్ డే సందర్భంగా కమలా హారిస్ మాట్లాడిన తీరు మీద ట్రంప్ బృందం ట్రోల్ చేస్తోంది. ఆమె నకిలీ యాసతో మాట్లాడారంటూ కొత్త ప్రచారాన్ని స్టార్ట్ చేశారు.
ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఇప్పటికే అక్రమంగా మద్యం, డబ్బులు పంపిణీ జరుగుతోంది. మరోవైపు ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తాజాగా సూర్యపేట జిల్లా లో పలు హోటల్స్, లాడ్జ్‌లు, దాబాలు తనిఖీలు నిర్వహించడం జరిగింది.
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్‌పై కేసు నమోదు అయింది. ప్రచారంలో భాగంగా అర్వింద్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని జగిత్యాల అర్బన్, రూరల్ మండల ఎలక్షన్ ఎఫ్ఎస్టీ ఇన్చార్జి విజయేంద్రరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీపై కేసు నమోదు చేసినట్టు జగిత్యాల టౌన్ సీఐ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ప్రచార సమయం గడువు ముగియనుంది. చివరి రోజు కావడంతో నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అగ్రనేతలు సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రచార హోరుకు ఈ సాయంత్రంతో చెక్ పడనుంది. మే 13న జరిగే ఎన్నికల కోసం గత 57 రోజులుగా చేస్తున్న రాజకీయ నాయకుల ప్రచారం ఈరోజు సాయంత్రం ముగుస్తుంది. తరువాత ఎటువంటి ప్రచార సందడి ఉండకూడదు. దీంతో ఈరోజు చివరి ప్రచార సభలకు అన్ని పార్టీలు రెడీ అయిపోయాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. ఉదయం 9 గంటలకు చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ లో జిరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఉ. 11 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధీలోని వనపర్తిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు.
ఏపీలో ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. చిత్తూరు, నంద్యాలలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా.. వైఎస్ జగన్ పల్నాడు, ఏలూరు జిల్లా, కాకినాడలో ప్రచారం చేయనున్నారు. జేపీ నడ్డా సైతం తిరుపతిలో కూటమి నేతలతో కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు.