IR Raids: హైదరాబాద్‌లో ఐటీ దాడులు

హైదరాబాద్ నగరంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ స్వస్తిక్‌లో ఐటీ సోదాలు నిర్వహించారు. రూ.300 కోట్ల విలువైన భూమికి సంబంధించిన లావాదేవీలను స్వస్తిక్ గ్రూప్ బ్యాలెన్స్ షీట్‌లో చూపించకపోవడంతో.. యజమానులు కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో తనిఖీలు చేపట్టారు.

New Update
IT RIDES

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. నగరంలోని ఓ రియల్ ఎస్టేట్‌ కంపెనీలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని స్వస్తిక్ రియల్ ఎస్టేట్ కంపెనీలో సోదాలు నిర్వహించగా.. విలువైన భూమిని అమ్మకానికి పెట్టిన సొమ్మును కంపెనీ అధికారులు లెక్కను చూపించలేదు. షాద్‌నగర్‌లో రూ.300 కోట్ల విలువైన భూమిని ఓ కంపెనీకి స్వస్తిక్ రియల్ట్ అమ్మింది.

ఇది కూడా చదవండి: అఘోరీ కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం సతీమణి.. వీడియో వైరల్

బ్యాలెన్స్ షీట్‌లో చూపించకపోయే సరికి..

 కానీ వాటి లావాదేవీకి సంబంధించిన డబ్బును మాత్రం స్వస్తిక్ గ్రూప్ బ్యాలెన్స్ షీట్‌లో చూపించలేదు. ఈ క్రమంలో ఐటీ అధికారులు స్వస్తిక్ గ్రూప్ యజమానులు అయిన కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. తెల్లవారు జాము నుంచే ఐటీ అధికారులు స్వస్తిక్ కంపెనీతో పాటు చేవెళ్ల, షాద్‌నగర్‌లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: బిగ్‌ బ్రేకింగ్.. పవన్ బయటకు రా, జనసేన పార్టీ ఆఫీసు ఎదుట అఘోరి రచ్చ!

ఇదిలా ఉంటే.. నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలపై ఎప్పటికప్పుడూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ‌లో నిర్వహించారు. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ కార్పొరేట్ కార్యాలయాలపైన ఐటీ అధికారులు దాడులు చేశారు.

ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ప్రభుత్వం తీపికబురు.. 100శాతం మినహాయింపు

గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ అధినేత అక్బర్ షేక్ ఇంట్లో చేయడంతో పాటు కార్యాలయాలలోనూ ఐటీ దాడులు జరిగాయి. అన్విత బిల్డర్స్ అధినేత అచ్యుతరావు నివాసంతో పాటు, బొప్పన శ్రీనివాస్, బొప్పన అనూప్ ఇండ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. మళ్లీ ఇప్పుడు అధికారులు దాడులు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: పెళ్లికాని ప్రసాద్‌లే టార్గెట్.. పెళ్లి చేసుకుని లక్షల్లో కన్నం!

Advertisment
Advertisment
తాజా కథనాలు