Maganti Sunitha: మాగంటి సునీతకు బిగ్ షాక్.. తల్లి సంచలన ప్రకటన

మాగంటి గోపీనాథ్ తల్లితో సునీతకు మాటలు లేవని, కనీసం పోటీ చేస్తున్న విషయం కూడా ఆమెకు తెలియదని తల్లి వెల్లడించింది. ప్రద్యుమ్నకు అన్యాయం జరిగిందని గోపీనాథ్ తల్లి తెలిపింది. దీంతో మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీ దేవి లీగల్‌గా వెళ్తామని వెల్లడించింది.

New Update
maganti sunitha

maganti sunitha

జూబ్లీహిల్స్ ఎన్నికలకు(jubilee hills by elections 2025) మరికొన్ని రోజులే మిగిలి ఉన్న వేళ.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(maganti Sunitha) కు బిగ్ షాక్ తగిలింది. ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై మాగంటి గోపీనాథ్(maganti-gopinath) మొదటి భార్య మాలినీ దేవి(maganti malini devi) అభ్యంతరం తెలిపింది. ఈ అంశంపై శేరిలింగంపల్లి తహసీల్దార్ నేడు చేపట్టిన విచారణకు ఆమె హాజరయ్యారు. సునీత మాగంటి గోపీనాథ్ భార్య కాదంటూ ఇప్పటికే మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చూడండి: Pawan Kalyan: మోకాలి లోతు బురదలో తిరుగుతూ.. రైతులకు పవన్ భరోసా-PHOTOS

మనవడికి న్యాయం చేయాలి..: గోపీనాథ్ తల్లి

ఈ రోజు విచారణకు గోపీనాథ్ తల్లి మహానంద కుమారి కూడా హాజరయ్యారు. తన మనవడు ప్రద్యుమ్నకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. మాలినీ దేవి, గోపినాథ్ కు పెళ్లి తానే చేశానని చెప్పుకొచ్చింది. ఇందుకు అనేక సాక్ష్యాలు ఉన్నాయని వెల్లడించింది. తన కొడుకు చావుబతుకుల మధ్యలో ఉన్న సమయంలో కూడా తనను చూడనివ్వలేదని ఆరోపించింది. ఈ విషయం కేటీఆర్ కు చెప్పినా పట్టించుకోలేదని తెలిపింది. తన కుమారుడు గోపినాథ్ మరణం కూడా ఓ మిస్టరీ అని అనుమానం వ్యక్తం చేసింది. 

మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీ దేవి మాట్లాడుతూ.. తాను లీగల్‌గా వెళ్తామని వెల్లడించింది. మాగంటి సంతానం ప్రద్యుమ్న అని, ఇతనే తన వారసుడు అని, అతనికి అన్యాయం జరగకుండా చూస్తానని మాలినీ దేవి తెలిపింది. తన దగ్గర వందల ఫ్రూఫ్స్ ఉన్నాయని, కుటుంబ సపోర్ట్ అంతా కూడా ఉందని మాలినీ దేవి మీడియాకు వెల్లడించింది. 

ఇదిలా ఉంటే.. మాగంటి సునీతకు గోపీనాథ్ తరఫు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి మద్దతు లేదని తెలుస్తోంది. సునీత కుటుంబ సభ్యులతో వారు మాట్లాడడం లేదని సమాచారం. కనీసం పోటీ చేస్తున్న విషయం కూడా తనకు తెలియదని గోపీనాథ్ తల్లి మహానంద కుమారి నేడు వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇది కూడా చూడండి: Viral Video: డిప్యూటీ సీఎంపై చెప్పులు, పేడ విసిరిన ప్రజలు.. వీడియో వైరల్!

Advertisment
తాజా కథనాలు