పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో మను భాకర్ కాంస్య పతకం సాధించి భారతీయ జెండాను ఒలంపిక్స్ వేదికపై రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమెను సినీ, రాజకీయ ప్రముఖులతో సహా అనేక మంది అభినందనలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఇది చారిత్రామ్మక మెడల్ అంటూ మను భాకర్‌ను కొనియాడుతూ.. ప్రధాని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున మొదటి మెడల్ సాధించండంపై ఆమెకు అభినందనలు తెలిపారు. అలాగే భారత్ నుంచి షూటింగ్‌లో మొదటి మహిళగా ఆమె పథకం సాధించినందున ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు.
ఒలింపిక్స్‌లో తన ప్రతిభలో కాంస్య పతకం గెలిచి భారత్ కీర్తిని చాటిన మను భాకర్‌రు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందలు తెలియజేశారు. ఆమెను చూసి దేశం గర్వపడుతోందని తెలిపారు. మను భాకర్ సాధించిన ఈ విజయం ఎంతోమంది క్రీడాకారులు, ముఖ్యంగా మహిళలకు స్పూర్తిదాయకమంటూ ప్రశంసించారు.
మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మను భాకర్‌కు అభినందనలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో పథకం సాధించిన మొదటి మహిళగా మను భాకర్ చరిత్ర సృష్టించిందంటూ ప్రశంసించారు.
Also Read : గ్రూప్-2,3 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ‘పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక’గా ఫ్రీ కోచింగ్!