Cyber Crime: నిరుద్యోగులకు రూ.35 కోట్లు టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు.. అసలేం జరిగిందంటే..

వర్క్‌ ఫ్రం హోం పేరుతో సైబర్ నేరగాళ్లు నిరుద్యోగుల నుంచి రూ.35 కోట్లు వసూలు చేయడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లాలోని రూ.2 లక్షలు పోగొట్టుకున్న ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ స్కామ్‌కు సంబంధించి ఓ నిందితుడ్ని అరెస్టు చేశారు.

Cyber Crime: నిరుద్యోగులకు రూ.35 కోట్లు  టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు.. అసలేం జరిగిందంటే..
New Update

ఓవైపు సాంకేతికత రోజురోజుకు అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు అది దుర్వినియోగం అవుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్యకాలంలో చాలామంది సైబర్ నేరాలగాళ్ల వలలో పడి వేలు, లక్షలు, కోట్లు కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి. కేవలం చదువుకోని వాళ్లు మాత్రమే వీళ్లకు బలికావడం లేదు.. చివరికి చదువుకున్న వారు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసేవారు కూడా వీరి చేతిలో మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో యువతకు ఆన్‌లైన్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన కొంతమంది సైబర్ కేటుగాళ్లు .. వారి నుంచి ఏకంగా రూ.35 కోట్లు బురిడి కొట్టించారు. తాము మోసపోయామని తెలియడంతో రూ. 2 లక్షలు కోల్పోయిన ఓ బాధితురాలు అనంతపురం జిల్లా గార్లదిన్నే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఓ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Also read: మా బిడ్డకి కోడిగుడ్డు తినిపించేశారు.. ఓ తండ్రి ఫిర్యాదు.. 

ముందుగా సైబర్‌ నేరగాళ్లు నిరుద్యోగులే లక్ష్యంగా వర్క్‌ ఫ్రమ్ హోం పేరుతో ఓ లింక్ పంపుతారు. కొంతకాలం పాటు ఆ బాధితుల ఖాతాలకు రూ.30 వేలు బదిలి చేసి నమ్మిస్తారు. ఆ తర్వాత ఎక్కువగా పనిచేస్తే లక్షల్లో జీతం ఇస్తామని చెబుతారు. అయితే ఇలా ఇవ్వాలంటే ముందుగా 10 శాతం డిపాజిట్‌ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తాము మోసపోయినట్లు చివరికి బాధితులు తెలుసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు.. సైబర్ నేరగాళ్లు మొత్తం రూ.35 కోట్లు వసూలు చేశారని గుర్తించారు. నెల్లూరు కేంద్రంగా ఈ మోసగాళ్లు యువతను వలలో వేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా 11 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి.. 172 ఖాతాలకు వచ్చిన సొమ్మును బదిలీ చేసినట్లు గుర్తించారు. అయితే ఆ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేశామని.. పోలీసులు తెలిపారు. నెల్లూరులోని ఓ బ్యాంకు ఖాతాలో రూ.14 లక్షలు సీజ్‌ చేసి నిందితుడైన సమద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితులను పట్టుకునేందుకు కూడా పోలీసులు రంగంలోకి దిగారు.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

#cyber-crime #cyber-crime-police #cyber-scam #national-news #telugu-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe