Nalanda University : పుస్తకాలు అగ్నికి కాలిపోవచ్చు.. కానీ జ్ఞానం కాదు : మోదీ

అగ్నికి పుస్తకాలు కాలిపోవచ్చు గాని.. జ్ఞానం కాదని ప్రధాని మోదీ అన్నారు. బుధవారం బిహార్‌లోని రాజ్‌గిర్‌లో నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కొత్త విశ్వవిద్యాలయం దేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోందని పేర్కొన్నారు.

New Update
Nalanda University : పుస్తకాలు అగ్నికి కాలిపోవచ్చు.. కానీ జ్ఞానం కాదు : మోదీ

PM Modi : బిహార్‌ (Bihar) లోని రాజ్‌గిర్‌లో ఈరోజు(బుధవారం) ప్రధాని మోదీ నలందయ యూనివర్సిటీ (Nalanda University) కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిహార్ గవర్నర్ రాజేంద్ర వి. అర్లేకర్, సీఎం నీతిష్ కుమార్ (CM Nitish Kumar), విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నలంద యూనివర్సిటీ.. భారత వారసత్వానికి, సంస్కృతికి చిహ్నమని అన్నారు. పురాతన శిథిలాల నుంచి ఇది పునరుజ్జీవించిందని ప్రశంసించారు. ఈ కొత్త విశ్వవిద్యాలయం దేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోందని పేర్కొన్నారు. అగ్నికి పుస్తకాలు కాలిపోవచ్చు గాని.. జ్ఞానం కాదన్నారు.

Also Read: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్

ఇదిలా ఉండగా.. ఐదో శతాబ్దంలో ఏర్పాటుచేసిన పురాతన నలంద యూనివర్సిటీలో అప్పట్లో ఒకానొక టాప్‌ యూనివర్సిటీగా ఉండేది. ప్రపంచ దేశాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకునేవారు. నలంద విశ్వవిద్యాలయం దాదాపు 800 ఏళ్ల పాటు సేవలందించిందని నిపుణులు తెలిపారు. 12వ శతాబ్ధంలో భారత్‌లోకి చొరబడ్డ అఘ్గన్లు ఈ యూనివర్సిటీని కూల్చివేశారు. అందులో ఉన్న పుస్తకాలను, మాన్యుస్క్రిప్ట్‌లను తగులబెట్టేశారు. అయితే 2016లో ఐక్యరాజ్యసమితి ఈ ప్రాంతాన్ని వారసత్వ సంపదగా ప్రకటించింది.

Also Read: వరుస ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా.. రాహుల్ గాంధీ ఎదుర్కొన్న ఎదురు దెబ్బలివే!

Advertisment
తాజా కథనాలు