Viral : మాకు ఉద్యోగాలు చేసుకోవడానికి అవడం లేదు... బిడ్డను దత్తత తీసుకోండి

పిల్లలు పుట్టక చాలామంది నానాపాట్లు పడుతుంటే..ఒక జంట మాత్రం మేము ఉద్యోగాలు చేసుకోవాలి మా బిడ్డను దత్తత తీసుకోండి అని అడుగుతున్నారు. పైగా సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ కూడా పెట్టారు. ఇప్పుడు ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

Viral : మాకు ఉద్యోగాలు చేసుకోవడానికి అవడం లేదు... బిడ్డను దత్తత తీసుకోండి
New Update

Baby Adoption : పిల్లల(Kids) కోసం తల్లిదండ్రులు(Parents) చేయని ప్రయత్నం ఉండదు. ఈ మధ్య కాలంలో సంతానలేమి చాలా ఎక్కువైపోయింది. సంతానం కోసం గుళ్ళుగోపురాలు తిరుగుతూ, చికిత్సలు చేయించుకుంటున్నారు చాలా మంది. అది కాక ఐవీఎఫ్‌(IVF) లను ఆశ్రయిస్తున్నారు. పిల్లలు కలగకపోతే ఎంత బాధ ఉంటుందో లేని వాళ్ళకు బాగా తెలుసు. కానీ కొంతమంది మాత్రం పిల్లలు పుట్టినా... వారిని చూసుకోలేమంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. తాజాగా ఓ జంట సోషల్ మీడియా(Social Media) లో ఇలాంటి పోస్టే ఒకటి పెట్టింది.

మాకుకుదరడం లేదు.. దత్తత తీసుకోండి..
ఇది ఎక్కడ ఎవరు పెట్టారో తెలియదు కానీ.. పిల్లను దత్తత(Adoption) ఇస్తాము తీసుకోండి అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చాలా వైరల్ అవుతోంది. తమకు మూడు నెలల పాప ఉందని... ఆమెను చూసుకోవడానికి అవడం లేని కారణంగా దత్తతకు ఇస్తామని పోస్ట్ పెట్టాడు పాప తండ్రి. సరేలే ఇది కామనే అనుకున్నా... దానికి అతను చెప్పిన కారణం చూసి మాత్రం నెటిజన్లు మండిపడుతున్నారు. పాపను చూసుకోలేకపోవడానికి కారణం భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడమేనట. తాను, తన భార్య ఎప్పుడూ ఆఫీసు పనుల్లో బిజీగా ఉంటామని.. దానివలన పాప ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారని అని అంటున్నాడు.

తన భార్య రోజూ ఆఫీస్‌కు వెళుతోందని... పాప ఎలిజిబెత్‌కు పాలు పట్టించడం, బట్టలు మార్చడం, స్నానం చేయించడం తప్ప ఇంకేం పని చేయడానికి వీలు అవడం లేదని చెబుతున్నాడు తండ్రి. తమకు బిడ్డ పుట్టి 3 నెలలు పూర్తి అయినప్పటికీ.. ఇప్పటివరకు ఎలిజబెత్‌తో సరిగ్గా సమయం కూడా గడపలేదని తెలిపాడు. ఎలిజబెత్‌ను ప్రస్తుతం ఆమె అమ్మమ్మ చూసుకుంటుందని వివరించాడు. దాంతో పాటూ ఆఫీస్ పని మీద తన భార్యకున్న నిబద్ధత అలాంటిదని పొగుడుతున్నాడు. ఎలిజిబెత్‌ను కుటుంబంలోని వారు కానీ.. బయటవారు కానీ దత్తత తీసుకోవాలని కోరుతున్నాడు.

రెడిట్‌లో పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు తల్లిదండ్రులను తెగ తిడుతున్నారు. పుట్టిన 3 నెలలకే బిడ్డ అంత చులకన అయిపోయిందా అని కొంతమంది... ఉద్యోగాల మీద అంత మక్కువ, డెడికేషన్ ఉన్నప్పుడు అసలు పిల్లను ఎందుకు కన్నారు అంటూ మరికొంతమంది ఫైర్ అవుతున్నారు. అందరూ వాళ్ళల్లాగే ఉద్యోగాలు చేస్తూనే పిల్లలను కంటున్నారని.. అలాంటప్పుడు వీళ్ళ స్పెషాలిటీ ఏంటని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. మనుషుల్లా ప్రవర్తించండి అంటూ మండిపడుతున్నారు.

Also Read : Andhra Pradesh : పిఠాపురంలో భారీగా ఎన్నికల సామాగ్రి పట్టివేత

#viral-news #parents #baby #jobs #adoption
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe