Pawan Kalyan about Movies : నేను రాజకీయ పార్టీని నడపాలంటే నాకు సినిమాలే ఇంధనమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం గాజువాక లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ (YS Jagan) ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని వేషాలు వేసిన ఏపీ ప్రజలు భరించాల్సింది కేవలం ఆరు నెలలు మాత్రమే అని ఆయన పేర్కొన్నారు.
అసలు రాష్ట్రంలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. ఏమి మాట్లాడిన గయ్యాలి వారు మీద పడినట్లు పడిపోతున్నారు అంటూ వైసీపీ నేతలకు చురకలు అంటించారు. నా కుటుంబం గురించి మాట్లాడిన నేను పట్టించుకోను అని వివరించారు.
విశాఖపట్నం నా రెండో ఇల్లు:
లక్షల కోట్లు ఆస్తులను కేవలం తన ప్రయోజనాల కోసం తెలంగాణకు అప్పజెప్పి వచ్చిన వ్యక్తి జగన్ అంటూ విరుచుకుపడ్డారు. కాలం కలిసి వస్తే నేను కూడా వైజాగ్ లో రెండో ఇల్లు కట్టుకుంటానని ఆయన వివరించారు. నేను ప్రజల పక్షాన ఉండే వ్యక్తిని ..నేను మీతో ఉంటే ఆ ధైర్యమే వేరు అంటూ ఆయన మాట్లాడారు.
పవన్ ఈ సభలో మరోసారి వాలంటీర్ల (AP Volunteers) గురించి ప్రస్తావించారు. వాలంటీర్లుకు బాస్ ఎవరు. వారు సేకరించిన డేటా అంతటిని ఎవరికి ఇస్తున్నారు అంటూ ప్రశ్నించారు. అసలు వారికి జీతాలు ఇవ్వడానికి నగదు ఎక్కడ నుంచి తీసుకుని వస్తున్నారంటే ప్రభుత్వంలోని పెద్దలు ఒక్కరు కూడా మాట్లాడటం లేదు అంటూ ఆయన పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన మూడేళ్ల లోపే వైజాగ్ కి ఐటీ వైభవం తీసుకుని వస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అన్ని చట్టాలను తన చుట్టాలుగా చేసుకుని ఒక్క చట్టానికి కూడా గౌరవం ఇవ్వని జగన్ వెంటనే అధికారంలో నుంచి దిగిపోవాలని ఆయన అన్నారు.
అనుమతులు లేకుండా వైజాగ్ (Vizag) ఎంపీ నిర్మిస్తున్న నిర్మాణాలను వెంటనే కూల్చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీ ఎంవీవీ సిరిపురం ప్రాజెక్టులో పెట్టిన లోన్లు ఇచ్చిన వారు ముందుగా నష్టపోతారని ఆయన సూచించారు. ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి ఓ గుండా..అందుకే ఆయన యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయన పై ఉన్న రౌడీ షీట్ ను మళ్లీ తెరిపిస్తానని ఆయన అన్నారు.
జగన్ ..ఏపీ ప్రజులు మేల్కొన్నారు..నువ్వు వెంటనే గద్దె దిగిపోవాలని ఆయన కామెంట్స్ చేశారు. సీఎం దేవుడు అని కొలిచిన ప్రజలకు దెయ్యంలా తయారవంటూ సీఎం పై విరుచుకుపడ్డారు. జనసేన అనే పార్టీని నడిపించాలంటే నాకు సినిమాలే ఇంధనం అని పేర్కొన్నారు.
చివరి శ్వాస వరకు కూడా ప్రజల భవిష్యత్, నేల కోసం పోరాడతానని పవన్ పేర్కొన్నారు. ఈసారి మాత్రం జగన్ ను భరించలేమని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వం తప్ప..ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సరే స్వాగతిద్దామని పవన్ పేర్కొన్నారు.
ఓటు చీలిపోకూడదని ఆయన కోరారు. నాకు ఏ వ్యక్తి మీద కూడా వ్యక్తి గత ద్వేషం లేదు. కేవలం జరుగుతున్న విధ్వాంసాల మీదే తమ ఆందోళన అంటూ పవన్ పేర్కొన్నారు.
Also Read: ఏది ఏమైనా గన్నవరం నుంచే నా పోటీ: యార్లగడ్డ!