Pawan Kalyan lefts NDA: ఎన్డీయేకు గుడ్‌బై..జనసేనాని కీలక నిర్ణయం.! ఎన్డీయేకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కటీఫ్ చెప్పేశారు. బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) నుంచి బయటకు వచ్చినట్టు జనసేన ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే టీడీపీ లాంటి బలీయమైన శక్తి అవసరమని పవన్ పేర్కొన్నారు. By Jyoshna Sappogula 05 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Pawan Kalyan lefts NDA to support Chandrababu Naidu: ఎన్డీయేకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుడ్‌బై చెప్పేశారు. బీజేపీ (BJP) సారథ్యంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) నుంచి బయటకు వచ్చినట్టు జనసేన (Janasena) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే టీడీపీ (TDP) లాంటి బలీయమైన శక్తి అవసరమని పవన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితుల్లో ఆ పార్టీకి జనసేన మద్దతు అవసరమని స్పష్టం చేశారు. జనసేన, టీడీపీ కలిస్తే ఆ ప్రభావం అధికార వైసీపీపై తీవ్రంగా పడుతుందని వివరించారు. జనసేనలాంటి యువరక్తం టీడీపీకి అవసరమని నొక్కి చెప్పారు. ప్రస్తుతం వారాహి (Varahi Yatra) నాలుగో విడత యాత్రలో ఉన్న పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీతో పొత్తును అధికారికంగా ప్రకటించిన అనంతరం జరుగుతున్న యాత్ర కావడంతో.. ఈ సభలకు టీడీపీ కేడర్ నుంచి కూడా మద్దతు దొరుకుతుందని తెలుస్తుంది. పవన్ బహిరంగ సభల్లో అక్కడక్కడా పసుపు జెండాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎన్డీఏ కూటమి విషయంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని, కష్టమైనా తప్పలేదని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. కృష్ణాజిల్లా పెడనలో ఎన్డీఏ కూటమి, టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ కీ లక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ఇటీవల ప్రకటించింది. తెలంగాణలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆ పార్టీ 32 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించబోతోంది. వీటిలో చాలావరకు స్థానాలు హైదరాబాద్, ఖమ్మం, నల్గొండలోనే ఉన్నాయి. కాగా, తెలంగాణలో పోటీ చేయబోతున్నట్టు ఇటీవల టీడీపీ కూడా ప్రకటించింది. ఖమ్మంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనుంది. Also Read: నేటితో ముగుస్తున్న చంద్రబాబు రిమాండ్..నెక్ట్స్ ఏం జరగబోతోంది..!! #pawan-kalyan #chandrababu #bjp #ap-politics #janasena #rtvlive-com #nda #tdp-party #pawan-kalyan-lefts-nda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి