సార్ మీరే మాకు దిక్కు..| Vizianagaram Sasanapalli village Peoples Letter To Pawan Kalyan | RTV
మూడేళ్ల కింద చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడంపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. స్పీకర్ తమ్మినేని తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. గంటా శ్రీనివాస్ వేసిన పిటిషన్ ఈ నెల 29న విచారణకు రానుంది.
సజ్జల రామకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు లోకేష్. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 33రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న అంగన్ వాడీలు తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు విజయవాడ, గుంటూరు, తాడేపల్లిలోని సీఐడీ ఆఫీసులకు వెళ్లనున్నారు. IRR, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ రావడంతో పూచీకత్తు, షూరిటీలను సీఐడీ అధికారులకు చంద్రబాబు ఇవ్వనున్నారు.
సీఎం జగన్ విమర్శల దాడి చేశారు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు. జగన్ ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీ చేశాడని చురకలు అంటించారు. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
విశాఖలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ పై టీడీపీ నేత లోకేష్ ఘాటుగా స్పందించారు. సీఎం ఇంటిపక్కనే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే నేటివరకూ నిందితుడ్ని పట్టుకోలేదు అని ఫైర్ అయ్యరు. రాక్షస పాలనలో రక్షణలేదు అంటూ మండిపడ్డారు.
టీడీపీపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ కొత్త బిజినెస్ చేస్తుందని ఆరోపించారు. తప్పుడు ఫిర్యాదులతో ఎన్నికల కమిషన్ సమయాన్ని టీడీపీ వృధా చేస్తుందని పేర్కొన్నారు. ఒక యాప్ తో ఓటర్ల డేటాను టీడీపీ కొల్లగొడుతుందని అన్నారు.
‘‘స్కిల్పై నిందలు వేయడమంటే, యువత భవితపై దాడి చేయడమే’’ అనే పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు ఆవిష్కరించారు. చంద్రబాబు పై కేసులో ఆధారాలు చేపలేక రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలే అక్రమాలు అని కట్టుకథ చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్డీయేకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కటీఫ్ చెప్పేశారు. బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) నుంచి బయటకు వచ్చినట్టు జనసేన ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే టీడీపీ లాంటి బలీయమైన శక్తి అవసరమని పవన్ పేర్కొన్నారు.